ETV Bharat / bharat

Aditya L1 Maneuver Mission : ఇస్రో మరో కీలక విన్యాసం.. ఆదిత్య ఎల్​1 రెండో భూ కక్ష్య పెంపు సక్సెస్​

Aditya L1 Maneuver Mission : ఆదిత్య ఎల్​ 1 ఉపగ్రహం.. రెండో భూ కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. ప్రస్తుతం ఆదిత్య ఎల్‌-1.. 282 కిలో మీటర్లు బై 40,225 కిలోమీటర్లు నూతన కక్ష్యలో ఉన్నట్లు తెలిపింది.

aditya l1 maneuver mission
aditya l1 maneuver mission
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 7:09 AM IST

Updated : Sep 5, 2023, 7:39 AM IST

Aditya L1 Orbit Raising : సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్​1 లక్ష్యం దిశగా సాగుతోంది. దీనికి సంబంధించి రెండో భూ కక్ష్య పెంపు ప్రక్రియను మంగళవారం ఇస్రో చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్​వర్క్​ ఈ ఆపరేషన్​ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం.. 282 కిలో మీటర్లు బై 40,225 కిలోమీటర్ల నూతన కక్ష్యలో ప్రవేశించినట్లు తెలిపింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 10 చేపడతామని ఇస్రో సోషల్​ మీడియా వేదిక ఎక్స్​ ద్వారా తెలిపింది. సెప్టెంబర్​ 3న భూ కక్ష్య పెంపు తొలి విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించారు.

  • Aditya-L1 Mission:
    The second Earth-bound maneuvre (EBN#2) is performed successfully from ISTRAC, Bengaluru.

    ISTRAC/ISRO's ground stations at Mauritius, Bengaluru and Port Blair tracked the satellite during this operation.

    The new orbit attained is 282 km x 40225 km.

    The next… pic.twitter.com/GFdqlbNmWg

    — ISRO (@isro) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ISRO Aditya L1 Mission Launch Date : 'ఆదిత్య-ఎల్‌1' ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం (2023 సెప్టెంబర్ 2) శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశించింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది 'ఆదిత్య-ఎల్‌1' వ్యోమనౌక. అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్‌1 బిందువు (lagrange point 1) దిశగా.. 125 రోజుల ప్రయాణం తర్వాత చేరుకోనుంది.

What Is Aditya L1 Mission : లగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. ఫలితంగా అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేసే వీలు ఉంటుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపట్టింది.

Aditya L1 Mission Details : ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్​లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లు (Aditya L1 Mission Payloads In Telugu) ఉన్నాయి. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని పరిశీలించేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను తయారు చేశారు.

Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు

Aditya L1 Mission Successful : 'మానవాళి సంక్షేమం కోసమే ఆదిత్య-ఎల్​1'.. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న వ్యోమనౌక

Last Updated : Sep 5, 2023, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.