ETV Bharat / bharat

ట్రాక్టర్ ర్యాలీ హింసలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్ - దీప్ సిద్ధూ ఎఫ్ఐఆర్ ట్రాక్టర్ ర్యాలీ హింస

ట్రాక్టర్ ర్యాలీ హింస ఘటనలో నటుడు దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. ఆయనతో పాటు మాజీ గ్యాంగ్​స్టర్ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్, 37 మంది రైతు నేతలపై ఎఫ్ఐర్ దాఖలు చేశారు.

actor-activist-deep-sidhu-named-in-case-on-tractor-rally-violence
ట్రాక్టర్ ర్యాలీ హింసలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్
author img

By

Published : Jan 28, 2021, 5:04 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన హింసపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ సహా సామాజిక కార్యకర్తగా మారిన గ్యాంగ్​స్టర్​ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్‌, రైతు నాయకులు రాకేశ్‌ టికైత్, యోగేంద్ర యాదవ్, దర్శన్‌పాల్‌పై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్​లో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఎర్రకోట ప్రాంగణంలో హింసకు పాల్పడిన వ్యక్తులను గుర్తిస్తున్నట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ఆయన.. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న 50 మందిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ సమయంలో సత్నాం సింగ్‌ పన్ను, దర్శన్‌ పాల్‌, బుట్టా సింగ్‌ వంటి రైతు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

హింసను ప్రొత్సహించిన ఏ ఒక్క కుట్రదారుడు చట్టం నుంచి తప్పించుకోలేరని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.