ETV Bharat / bharat

చేతిలో డబ్బు లేకున్నా ఎన్నికల బరిలోకి గొగొయ్​ - అసోం ఎన్నికలు తొలి దశ

చేతిలో పెద్దగా డబ్బు లేకుండానే ఇద్దరు సామాజిక కార్యకర్తలు అసోం ఎన్నికలలో పోటీ చేయనున్నారు. శనివారం జరగనున్న తొలిదశ ఎన్నికలలో కాంగ్రెస్​ కూటమి తరఫున ప్రణబ్​ డోలే, సొంత పార్టీ నుంచి అఖిల్​ గొగొయ్​ పోటీకి సిద్ధమయ్యారు.

Activist Akhil Gogoi, assam election 2021
అఖిల్​ గొగొయ్​
author img

By

Published : Mar 26, 2021, 8:50 PM IST

ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టే ధోరణికి భిన్నంగా ఇద్దరు సామాజిక కార్యకర్తలు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చేతిలో ఎలాంటి డబ్బు లేకుండానే అఖిల్​ గొగొయ్ బరిలోకి దిగుతుండగా​, రూ.10వేలతో ప్రణబ్​ డోలే పోటీకి సిద్ధమయ్యారు. అసోంలో శనివారం జరగనున్న తొలిదశ ఎన్నికలలో గొగొయ్​.. శివసాగర్​ నియోజకవర్గం నుంచి, డోలే.. బోకాఖత్​ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

అఖిల్​ గొగొయ్​..

క్రిషక్ ముక్తి సంగ్రామ్​ సమితికి సలహాదారుగా ఉన్న అఖిల్​ గొగొయ్​ ఇటీవల రాయ్​జోర్​ దళ్​ పేరుతో పార్టీని స్థాపించారు. తన వద్ద రెండు బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.60,497 ఉన్నాయని ఎన్నికల సంఘానికి నివేదించారు గొగొయ్​. కాజీరంగ జాతీయ పార్కుకు సమీపంలో ఉన్న ఆర్చిడ్​ పార్క్​కు సంబంధించి రూ.10వేలు విలువ చేసే షేర్లు ఉన్నాయని ప్రకటించారు. తనకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదని.. భార్య గీతశ్రీ తమూలే వద్ద రూ.50వేలు అప్పు తీసుకున్నానని తెలిపారు. గువాహటిలోని బొరూవా కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆయన భార్య పేరున రూ.1.66 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.

ప్రణబ్​ డోలే..

జీపాల్​ క్రిషక్​ శ్రామిక్​ సంఘ్లో​ సీనియర్​ నేత అయిన ప్రణబ్​ డోలే.. కాంగ్రెస్​ కూటమికి చెందిన అంచలిక్​ గణ మోర్చా తరఫున బరిలోకి దిగుతున్నారు. తన వద్ద చేతిలో రూ.10వేలు ఉన్నాయని ఈసీకి వెల్లడించారు. డోలేకు రూ.46,675 విలువ చేసే చరాస్తులు, మూడు బ్యాంక్​ ఖాతాల్లో రూ.20వేలు సహా ఏడాదికి రూ.15,675 చొప్పున ఇన్సురెన్స్ పాలసీకి చెల్లిస్తున్నానని అఫిడవిట్​లో పేర్కొన్నారు. వ్యవసాయం ద్వారా తనకు ఆదాయం వస్తుందని తెలిపిన డోలే.. అహోమ్​ గావ్​లో తనకు రూ. 4లక్షలు విలువ చేసే భూమి ఉందని వెల్లడించారు. ఇవి కాక రూ.2.53 లక్షలు విలువవైన ఆస్తిపై అప్పులు ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి : తేయాకు తోటల చుట్టూ అసోం రాజకీయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.