ETV Bharat / bharat

ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్​ - తెలంగాణ యువకుడిని అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు - ముకేశ్ అంబానీ తాజా వార్తలు

Accused Arrested in Mukesh Ambani Treat Mails Case : ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్​ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణకు చెందిన గణేశ్​ అనే యువకుడిని అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్​ విధించింది.

Accused in Mukesh Ambani Threat Main Got Arrested
Accused Arrested in Mukesh Ambani Treat Mails Case
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 7:29 PM IST

Updated : Nov 4, 2023, 7:34 PM IST

Accused Arrested in Mukesh Ambani Treat Mails Case : ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్​ అంబానీకి బెదిరింపు మెయిల్ పంపిన కేసులో ముంబయి పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేశ్​ వన్‌పార్ది ఈ బెదిరింపు మెయిల్ పంపించినట్లు గుర్తించిన ముంబయి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈరోజు ముంబయిలోని లోయర్ కోర్టులో ప్రవేశపెట్టడంతో.. కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఒక్కరే ఉన్నారా..? ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే వివరాలు సేకరించడానికి నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.

నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో గడేవీ పోలీసులు నిమగ్నమయ్యారు. ముఖేశ్​ అంబానీకి గత నెల 31న.. ఈ నెల 1న బెదిరింపు మెయిల్స్​ వచ్చాయి. రూ.400 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే అంతం చేస్తామని మెయిల్​లో హెచ్చరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా గణేశ్​ వన్‌పార్దిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన వాడిగా గుర్తించి వ్యక్తిగత వివరాలు సేకరించారు. నిందితుడిని ప్రశ్నించినప్పుడు రూ.400 కోట్లు డిమాండ్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఈ కేసును సీరియస్​గా తీసుకున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీనియర్ పోలీస్ అధికారి వివేక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గణేశ్​.. ముఖేష్ అంబానీ మెయిల్ ఐడీ ఎలా సేకరించాడని ఆరా తీస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే వివరాలు సేకరిస్తున్నారు.

Mukesh Ambani Gets Death Threat : ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌.. ఈసారి రూ.200 కోట్లు డిమాండ్‌

గతేడాదీ ఇలాంటి బెదిరింపులు..: గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఆగస్టు 15వ తేదీన బెదిరింపు కాల్స్​ చేశారు. ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్​కిసాన్​దాస్ హస్పిటల్​కు బెదిరింపు కాల్ చేశారు. ఆసుపత్రి పేల్చేస్తామని.. అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు కాల్​ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

Mukesh Ambani Gets Death Threat : ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు ఇవ్వకపోతే..

2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్​సుఖ్​ హీరేన్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఈ కేసును మొదట్లో ఇన్​స్పెక్టర్​ సచిన్​ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ఇందులో ప్రధాన సూత్రధారిగా తేలారు. దీంతో ఎన్​ఐఏ అధికారులు ఇన్​స్పెక్టర్​ సచిన్​ను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్​ అంబానీకి.. ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తొంది.

Jio AirFiber News : గణేష్​ చతుర్థి రోజున జియో ఎయిర్​ఫైబర్​ లాంఛ్​.. వైర్​లెస్​ టెక్నాలజీతో 5జీ సేవలు!

500కోట్ల డాలర్లు అప్పు తీసుకున్న రిలయన్స్, జియో.. దేశ చరిత్రలో అత్యధికం!

Last Updated : Nov 4, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.