ETV Bharat / bharat

వారిలో ఆసుపత్రి అవసరం 0.06% మందికే! - పరిశోధన

కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకున్న వారిలో వైరస్​ సోకే అవకాశం చాలా తక్కువని అపోలో ఇంధ్రప్రస్థ ఆసుపత్రి అధ్యయనం వెల్లడించింది. ఒకవేళ వైరస్​ బారిన పడినా.. 0.006 శాతం మందే ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో 97.38% మందికి రక్షణ ఉంటుందని వెల్లడించింది.

vaccination
కరోనా టీకా పంపిణీ
author img

By

Published : May 17, 2021, 11:52 AM IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నా.. ఆసుపత్రిలో చేరాల్సినంత ఇబ్బంది దాదాపుగా ఉండదని తాజా అధ్యయనం చెబుతోంది. కేవలం 0.06 శాతం మందికే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటుందని దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి తెలిపింది.

తొలి 100 రోజుల వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కొవిడ్‌ లక్షణాలతో రిపోర్ట్‌ చేసిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై ఈ ఆసుపత్రి అధ్యయనం నిర్వహించింది. 'వ్యాక్సినేషన్‌ తర్వాత ఇన్‌ఫెక్షన్‌' పేరుతో ఫలితాలను వెల్లడించింది.

"వ్యాక్సినేషన్‌ వంద శాతం కొవిడ్‌ నిరోధక శక్తిని ఇవ్వదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వ్యాధి సోకినా తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా రక్షిస్తుంది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో 97.38 శాతం కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ పొందారు. కొవిడ్‌ సోకిన వారిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 0.06 శాతం మందిలోనే కలిగింది"

-డా.అనుపమ్‌ సిబల్‌, ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌

కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్న 3,235 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం నిర్వహించగా.. వీరిలో 85 మంది వ్యాధి బారిన పడ్డారు. ఇందులో 65 మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోగా.. 20 మందికి ఒక డోసు మాత్రమే పూర్తయింది.

ఇదీ చూడండి: నారదా స్కామ్: బంగాల్​ మంత్రులను అరెస్ట్​ చేసిన సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.