పంటలకు కనీస మద్దతు ధరపై(MSP) చట్టపరమైన హామీ ఇవ్వాలనే రైతుల డిమాండ్ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు భాజపా ఎంపీ వరుణ్ గాంధీ(varun gandhi news). అలా చేయకపోతే రైతులు ఉద్యమం ఆపరని పేర్కొన్నారు. అలాగే లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా సూచించారు(varun gandhi on lakhimpur kheri). ఈమేరకు మోదికి లేఖ రాశారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని ప్రకటించడాన్ని వరుణ్ గాంధీ స్వాగతించారు(varun gandhi on farmers protest). ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయేవారు కాదన్నారు.
" పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్‌ను కేంద్రం నెరవేర్చాలి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఈ డిమాండ్ నెరవేరనంత వరకు రైతు ఉద్యమం ఆగదు. రైతుల ఆగ్రహం తీవ్రమై మరో రూపంలోకి మారగలదు. ఎంఎస్పీ వల్ల రైతులకు ఆర్థికంగా భద్రత కల్పించవచ్చు."
-లేఖలో వరుణ్ గాంధీ
లఖింపుర్ ఘటనకు(varun gandhi on lakhimpur) బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, దర్యాప్తు పారదర్శకంగా జరిపించాలని కోరారు వరుణ్ గాంధీ. అలాగే రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నారు. వారిపై పెట్టిన తప్పుడు కేసులను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు(varun gandhi farmers).
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుణ్ గాంధీ(varun gandhi news today). రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు. కేంద్ర నిర్ణయాలను బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: అజయ్ మిశ్రా హాజరయ్యే సమావేశానికి మోదీ రావొద్దు: ప్రియాంక