ACB Court on Chandrababu security: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ... ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట జైలు అధికారులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆయన తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి భధ్రతపై అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. మెడికల్ రిపోర్టులు కోర్టుకు సమర్పించాలని జైలు అధికారులను ఆదేశించారు.
TDP Leaders Protest In West Godavari : 'పశ్చిమ'లో టీడీపీ నేతల నిరసన... 'గడప గడపకు బాబుతో నేను'
జ్యుడిషియల్ రిమాండ్ 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు: చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదేవిధంగా చంద్రబాబు తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేశారు. సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ములాఖత్‌లు పెంచాలని ఆయన తరఫు లాయర్ల పిటిషన్లో పేర్కొన్నారు. లీగల్ ములాఖత్ రోజుకు మూడుసార్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టుకు విన్నవించారు. పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ములాఖాత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు తరఫున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇప్పటికే జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ను కలిసిన టీడీపీ నేతలు: ఇప్పటికే చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించడంపై... తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై రాజమహేంద్రవరంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ను సైతం కలిసి ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబుతో రోజుకు మూడు సార్లు లీగల్ ములాఖత్‌కు అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు కేసులపై వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోందని... ఈ కేసుల విచారణ దృష్ట్యా న్యాయవాదులతో చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అభ్యర్థన మేరకూ... అధికారులు స్పందించారు. ములాఖత్‌ల నేపథ్యంలో ఇతర ఖైదీలకు ఇబ్బందులు కలుగుతున్నాయని.. అందుకోసమే ములాఖాత్‌లను తగ్గిస్తున్నట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ములాఖత్‌లను పెంచే విషయంపై సైతం కోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టులో వాదనలు: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 40 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారన్న.. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారన్న చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.