ETV Bharat / bharat

'కాంగ్రెస్ బలపడాలన్నదే నా ఆకాంక్ష' - నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా

కాంగ్రెస్​ పార్టీ పరిస్థితిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని కాంక్షించారు. దేశంలోని విభజన శక్తులను ఎదుర్కొనేలా కాంగ్రెస్​ బలపడాలన్నారు.

Abdullah wants Congress to be strong to fight 'divisive forces' in country
'కాంగ్రెస్ బలపడాలన్నదే నా ఆకాంక్ష'
author img

By

Published : Mar 1, 2021, 6:04 AM IST

దేశంలో కాంగ్రెస్​ తిరిగి పుంజుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా ఆకాంక్షించారు. దేశంలోని విభజన శక్తులను ఎదుర్కొనేలా కాంగ్రెస్​ బలపడాలన్నారు. అంతకుముందు పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జమ్ముకశ్మీర్​లో కాంగ్రెస్​ అసంతృప్త నేతలు(జీ-23) 'శాంతి సమ్మేళన్' కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"కాంగ్రెస్​ బలపడాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్​ నాయకులంతా కలిసి దేశంలోని విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. కాంగ్రెస్​ 150ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ."

-- ఫరూక్​ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత

కశ్మీర్​లోని ఉగ్రసమస్యపై స్పందించారు అబ్దుల్లా. ఉగ్రవాదుల సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించేంత వరకూ ఉగ్రదాడులు ఆగవని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : 'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.