Harbhajan Singh nomination for rajya sabha: పంజాబ్‌లో ప్రభంజనం సృష్టించిన ఆమ్ఆద్మీ పార్టీ ఈ నెలాఖరున జరిగే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా మరో ముగ్గురిని ఎగువసభకు నామినేట్ చేసింది.
ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 9న ముగియనుండగా ఆమ్ ఆద్మీ పార్టీకి 5 రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. దిల్లీ-ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్‌లీ ప్రొఫెషనల్ వర్సిటీ ఉపకులపతి అశోక్ మిత్తల్, ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాను పెద్దల సభకు పంపుతోంది ఆప్.
6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 31న పోలింగ్ జరగనుంది. సోమవారం నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు.
లోక్సభకు శత్రుఘ్నుసిన్హా...
బంగాల్లోని అసన్సోల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల్లో బరి లోకి దిగుతున్నారు ప్రముఖ నటుడు శత్రుఘ్నుసిన్హా. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారాయన.
ఇదీ చూడండి: అధికార పార్టీ ఎంపీ ఇంట్లో దొంగతనం- వీఐపీలంతా ఆ కాలనీలోనే..