ETV Bharat / bharat

Aadhaar Free Update Last Date : గుడ్ ​న్యూస్.. ఆధార్​ ఫ్రీ-అప్డేట్​కు అప్పటి వరకు​ గడువు పెంపు.. ఆన్​లైన్​లో చేసుకోండిలా.. - ఆధార్​ కార్డు అప్డేట్ స్టేటస్​ చెక్​

Aadhaar Free Update Last Date : భారత విశిష్ట గుర్తింపు ప్రధికార సంస్థ (UIDAI).. ఆధార్​ ఉచిత అప్డేట్​ గడువును డిసెంబర్​ 14 వరకు పొడిగించింది. అంటే మరో మూడు నెలలపాటు అదనంగా సమయం ఇచ్చింది. అయితే ఆధార్​ ​వినియోగదారులు వీలైనంత త్వరగా తమ ఆధార్​లోని వివరాలను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలు మీ కోసం.

Aadhaar Free Update Last Date
Aadhaar Free Update Last Date
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 3:24 PM IST

Updated : Sep 8, 2023, 1:56 PM IST

Aadhaar Free Update Last Date : మ‌న దేశంలోని ముఖ్య‌మైన గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఒక‌టి. 2011లో అందుబాటులోకి వ‌చ్చిన ఈ కార్డు.. త‌ర్వాత కాలంలో కీల‌కంగా మారింది. అయితే.. అప్ప‌టి నుంచి అనేక మంది త‌మ వివ‌రాలను అప్డేట్​ చేసుకోలేదు. ప‌దేళ్ల‌కు పైబ‌డి వివ‌రాలు అప్డేట్​ చేసుకోని వాళ్లు.. ప్ర‌స్తుతం ఆ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని కొంత కాలంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)సంస్థ చెబుతూ వ‌స్తోంది. దీనికోసం ఉచితంగా అప్డేట్​ చేసుకునే వెసులుబాటు సైతం క‌ల్పించింది.

Aadhaar Update last Date : ఆధార్​ కార్డులోని వివ‌రాలు అప్డేట్​ చేసుకునేందుకు మొద‌ట‌ ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 14 వ‌ర‌కు నిర్ణీత గ‌డువు విధించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI). ఆ తర్వాత దీన్ని సెప్టెంబర్​ 14 వ‌ర‌కు పొడిగించింది. తాజాగా మరోసారి ఈ గడువును డిసెంబర్​ 14 వరకు పొడిగించింది. అంటే ఉచితంగా ఆధార్ వివరాలు అప్​డేట్​ చేసుకునేందుకు మరో మూడు నెలల సమయం అదనంగా ఇచ్చింది. ఈ స‌మ‌యంలోగా కార్డు హోల్డ‌ర్లు.. తమ వెబ్​సైట్​లో ఆధార్​ వివ‌రాలు ఉచితంగానే అప్డేట్​ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

ఆన్​లైన్​లో ఉచితంగా అప్డేట్​ చేసుకోండిలా..

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్​సైట్ https://myaadhaar.uidai.gov in ఓపెన్ చెయ్యండి.
  • మీ ఆధార్ నంబ‌రు, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. (ఆధార్​కు మొబైల్​ నంబర్​ లింక్​ అయితేనే ఓటీపీ వస్తుంది)
  • అక్క‌డ వివ‌రాల‌న్నీ ఒకసారి చెక్ చేసుకోండి.
  • అన్ని వివ‌రాలు సరిగ్గానే ఉంటే.. I verify that the above details are correct పై క్లిక్ చేసి లాగౌట్ అవ్వండి.
  • ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే.. అక్క‌డ ఉన్న మెనూ ప్ర‌కారం.. ఏ వివ‌రాలు అప్డేట్​ చేసుకోవాల‌నుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
  • త‌ర్వాత దానికి సంబంధించిన ధ్రువప‌త్రాన్ని అప్లోడ్​ చేయండి.
  • ముఖ్యంగా అది 2 MB కంటే త‌క్కువ సైజులో, JPEG, PNG లేదా PDF ఫార్మాట్​లో మాత్రమే ఉండాలి.
  • అది అప్లోడ్​ అయిన త‌ర్వాత సబ్మిట్​పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది.

Aadhaar Update Details: ఆన్​లైన్​లో అప్డేట్​ చేసుకోలేని వాళ్లు.. తమ దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్​కు వెళ్లాలని UIDAI సూచించింది. త‌గిన గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువ‌ప‌త్రాల‌తో అప్డేట్​ చేసుకోవాల‌ని చెప్పింది. దీనికోసం రూ.25 వ‌సూలు చేస్తారని తెలిపింది. ఎప్ప‌టిక‌ప్పుడు డెమోగ్రాఫిక్ స‌మాచారం ప‌క్కాగా ఉండేందుకు వీలుగా అప్డేట్​ చేసుకోవాలని పేర్కొంది.

ఎవ‌రెవ‌రు డీమోగ్రాఫిక్ స‌మాచారం అప్డేట్​ చేయాలి ?
కొత్త‌గా పెళ్లి చేసుకున్న వారు.. తమ చిరునామా మారితే ఆ వివరాలను అప్డేట్​ చేసుకోవాలి. పైగా మ‌హిళల‌కైతే పేరు, చిరునామా కూడా మార్చాల్సి ఉంటుంది. ఆధార్​కు లింక్​ లేని ఫోన్​ నంబర్​ వాడుతున్న వాళ్లు కూడా అప్డేట్​ చేసుకోవాలి. అద్దె ఇళ్ల‌ల్లో నివ‌సించే వారు.. ఒకవేళ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తే.. తమ చిరునామాను ఆధార్​ కార్డులో మార్చుకోవాలి.

PVC Aadhar Card Apply : 'ఆధార్'​ పోయిందా? PVC కార్డ్​ కోసం అప్లై చేసుకోండిలా..

How to Check Aadhaar Update History in Online : ఆధార్ అప్​డేట్ చేసుకున్నారా.. లేదా..? ఇది చదవాల్సిందే..!

How to Download Masked Aadhaar Card Online : ముఖానికి సరే.. ఆధార్​కు మాస్క్ తగిలించారా..? లేకపోతే...

Last Updated : Sep 8, 2023, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.