ETV Bharat / bharat

'కొవిన్​లో టీకా రిజిస్ట్రేషన్​కు ఆధార్​ తప్పనిసరి కాదు' - కొవిన్​ పోర్టల్​

CoWIN portal: కొవిన్​లో రిజిస్టేషన్​కు ఆధార్​ కార్డు తప్పనిసరేం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ సహా తొమ్మిది గుర్తింపు పత్రాలలో ఒకదాన్ని సమర్పించవచ్చని చెప్పింది.

Aadhaar card not mandatory on CoWIN portal
'కొవిన్​లో టీకా రిజిస్ట్రేషన్​కు ఆధార్​ తప్పనిసరి కాదు'
author img

By

Published : Feb 7, 2022, 3:00 PM IST

CoWIN Vaccine Registration: కరోనా టీకా రిజిస్ట్రేషన్​ కోసం కొవిన్ పోర్టల్‌లో ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. టీకా కోసం తొమ్మిది గుర్తింపు పత్రాలలో ఒక దానిని సమర్పించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ సహా తొమ్మిది గుర్తింపు పత్రాలలో ఒకదాన్ని సమర్పించవచ్చని చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌ ధర్మాసనానికి ఈ మేరకు వివరించింది.

కేంద్రం కొవిన్ పోర్టల్‌లో కరోనా వ్యాక్సిన్​ అందించడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అడుగుతోందని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు పిటిషనర్ సిద్ధార్థ్ శంకర్ శర్మ. ఈ విషయంపై 2021 అక్టోబర్ 1న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. దీనిపై స్పందన తెలియజేస్తూ.. జైలు ఖైదీలు, మానసిక ఆరోగ్య కేంద్రాల్లో ఖైదీలు సహా గుర్తింపు కార్డులు లేని ఇతర వర్గం వ్యక్తుల కోసం కూడా ఒక నిబంధన రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అఫిడవిట్​లో పేర్కొంది.

ఇదీ చదవండి: 'అభివృద్ధికి అడ్డుపడిన నకిలీ సమాజ్​వాదీలతో జాగ్రత్త'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.