ETV Bharat / bharat

స్నేహితులతో బెట్టింగ్.. చెరువులో ఈతకు దిగి యువకుడు మృతి.. - ఉత్తర్​ప్రదేశ్​లో చెరువులో ఈతకు దిగి యువకుడి మృతి

ఓ యువకుడు స్నేహితులతో బెట్టింగ్ కాసి చెరువులో ఈతకు దిగాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగులోకి వచ్చింది.

a young man died in the condition of crossing the pond by swimming in winter  in badaun
చెరువులో ఈత దిగి యువకుడు మృతి
author img

By

Published : Dec 31, 2022, 11:21 AM IST

ఉత్తర్​ ప్రదేశ్​ బదాయూ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. ఓ యువకుడు తన స్నేహితులతో బెట్టింగ్ కాసి ప్రాణాలు కోల్పోయాడు. చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ జరిగింది
వజీర్‌గంజ్ పరిధిలోని సైద్‌పుర్ గ్రామంలో దిల్షాన్(20) ముంబయిలో ఉంటూ క్రేన్ ఆపరేటర్​గా పనిచేసేవాడు. అయితే సెలవులకు ఆ యువకుడు స్వగ్రామం సైద్​పుర్​కు వచ్చాడు. ఈ క్రమంలోనే తన సోదరుడు ఫైజాన్, స్నేహితులు అంతా కలిసి తెల్లవారుజామున చలి మంటలు వేసుకుని.. సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే ఈ చలిలో చెరువులో ఎవరు దిగి ఈత కొడతారు అని పందెం వేసుకున్నారు. పందెంలో నెగ్గేందుకు దిల్షాన్ చెరువులో దూకి ఈత కొడుతుండగా.. దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మొదట అతడి ఆచూకీ కోసం గాలించినా దొరకలేదు. దీంతో అక్కడే ఉన్న అతడి సోదరుడు ఫైజాన్(17) కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించగా యువకుడి మృతదేహం లభ్యమైంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.