ETV Bharat / bharat

దీపావళికి రూ.21లక్షల బైక్ కొని ఊరేగించడం గుర్తుందా? పాపం ఇప్పుడా బండి బూడిదై..

దీపావళి పండుగ రోజు ఎంతో ఆనందంగా ఆ ఖరీదైన బైక్​ను కొని ఊరేగించాడు ఓ యువకుడు. కానీ ఆ ఆనందం 15 రోజులు కూడా నిలవలేదు. ఇంతలోనే అనుమానాస్పద రీతిలో ఆ బైక్​ అగ్నికి ఆహుతైపోయింది.

A two-wheeler worth 25 lakhs burnt down in Kolhapur

author img

By

Published : Nov 11, 2022, 3:29 PM IST

Updated : Nov 11, 2022, 4:06 PM IST

.

మహారాష్ట్ర కొల్హాపుర్‌లోని కలంబలో నివసిస్తున్న రాజేశ్ చౌగ్లే అనే యువకుడు దీపావళి పండుగ రోజు ఓ ఖరీదైన బైక్​ను కొని దాన్ని ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయిన ఆ వీడియోతో అతను బాగా పాపులర్​ అయ్యాడు. అయితే ఇప్పుడు అదే బైక్​ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి ఎలా అంటే..
15 రోజుల క్రితం కొన్న అదే బైక్​ గురువారం రాత్రి అనుమానాస్పద రీతిలో దగ్ధమైంది. ఎంతో ఆనందంగా ఆ బైక్​ను ఇంటికి తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఇలా జరగడం వల్ల అతను షాక్​కు గురయ్యాడు. అసలు ఆ బైక్​కు నిప్పు ఎలా అంటింది అన్న విషయం ఇప్పటికీ అర్థం కావాట్లేదని వాపోయాడు రాజేశ్.

ఊరేగింపుగా ఇంటికి..
రాజేశ్​ చౌగ్లే కొద్దిరోజుల క్రితమే డప్పుల మోతలతో ఊరేగింపుగా తన ద్విచక్ర వాహనానికి స్వాగతం పలికాడు. షోరూమ్​ నుంచి ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాడు. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసే రాజేశ్​ దీపావళి సందర్భంగా రూ.21 లక్షలు పెట్టి బైక్​ను కొనుగోలు చేశాడు. పశ్చిమ మహారాష్ట్రలో కవాసకి నింజా జెడ్​ఎక్స్​-10 ఆర్​ మోడల్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఇతడే. అతడి వద్ద ఇప్పటికే అనేక కార్లు, స్పోర్ట్స్​ బైక్​లు ఉన్నాయి.

ఇదీ చదవండి: 97 మంది ఓటర్ల కోసం కొండల మధ్య పోలింగ్​ సిబ్బంది సాహసం

చిన్ననాటి హాస్టల్​ రోజుల్ని గుర్తు చేసుకుని రాష్ట్రపతి భావోద్వేగం

Last Updated : Nov 11, 2022, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.