ETV Bharat / bharat

రెండు నెలల చిన్నారి గుండెకు అరుదైన ఆపరేషన్- దేశంలోనే ఫస్ట్!

Baby Heart Surgery: ముంబయిలోని జేజే ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. గుండెకు చిల్లు పడి ఇబ్బంది పడుతున్న రెండు నెలల చిన్నారికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ చేయకుండానే పూడ్చారు. ఇలా చేయడం దేశంలో తొలిసారి అని వైద్యులు తెలిపారు.

heart surgery for 2 month baby
రెండు నెలల చిన్నారి గుండె శస్త్ర చికిత్స
author img

By

Published : Dec 28, 2021, 1:49 PM IST

Baby Heart Surgery: ముంబయి డాక్టర్లు అరుదైన ఘనత సాధించారు. కర్ణాటకకు చెందిన కార్తీక్ రాఠోడ్ అనే రెండు నెలల చిన్నారి గుండెకు పడిన 6 మిల్లీమీటర్ల రంధ్రాన్ని ఓపెన్​ హార్ట్ సర్జరీ చేయకుండానే పూడ్చారు. ఇలా చేయడం దేశంలో తొలిసారి కాగా... ప్రపంచంలో ఇది రెండో శస్త్ర చికిత్స అని తెలిపారు.

heart surgery for 2 month baby
రెండు నెలల చిన్నారి గుండె శస్త్ర చికిత్స

చిన్నారి కాళ్లలో ఉండే సిరల ద్వారా గుండెకు ప్రత్యేక ట్యూబ్​ను పంపి హృదయానికి ఉన్న రంధ్రాన్ని పూడ్చినట్లు ముంబయి జేజే ఆసుపత్రి డాక్టర్ కళ్యాణ్​ ముండే తెలిపారు. చిన్నారికి ఉన్న సమస్యను వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారని పేర్కొన్నారు.

heart surgery for 2 month baby
గుండెలో ఉన్న 6 మిమీ రంధ్రం

నో చెప్పిన ఆ వైద్యులు...

చిన్నారి పుట్టినప్పుడే గుండెలో సమస్య ఉంది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేది. దీంతో సరిగా పాలు తాగక.. నిద్ర పోయేది కాదు, ఈ విషయాన్ని వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షలు చేయగా అసలు విషయం బయపడింది. దీంతో తల్లిదండ్రులు చాలా ఆసుపత్రులు తిరిగారు. చిన్నారి వయసుతో పాటు బరువు కూడా తక్కువ ఉండడం కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ఆస్పత్రుల వైద్యులు చికిత్స అందించేందుకు నిరాకరించారు. చివరకు ముంబయి జేజే ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్​ను విజయవంతంగా నిర్వహించారు.

సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్సను మహాత్మా జ్యోతిరావ్​ పూలే జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఉచితంగా జరిపినట్లు వైద్యులు చెప్పారు.

కార్తీక్​ తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. బాలుడు కోలుకోవడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.