ETV Bharat / bharat

'పెగసస్​'పై విచారణ ఈనెల 16కు వాయిదా - పెగసస్​

కోర్టుల విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలన్నారు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ. విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరమన్నారు. పెగసస్​పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణను సోమవారానికి(ఆగస్టు 16) వాయిదా వేశారు.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Aug 10, 2021, 11:31 AM IST

Updated : Aug 10, 2021, 11:38 AM IST

పెగసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మానం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్​ రమణ

" కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరం, కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. కోర్టు హాళ్లలో క్రమశిక్షణతో కూడిన చర్చలు జరగాలని తామెప్పుడూ కోరుకుంటాం. వాద, ప్రతివాదులు సమాచారపరంగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. పిటిషనర్లు చెప్పాలనుకున్న విషయాలను అఫిడవిట్​ రూపంలో సమర్పించాలి. సామాజిక మాధ్యమాలు, బయట జరిగే చర్చలకు పరిధి ఉండాలి."

- సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.

ఈ సందర్భంగా తమ కక్షిదారులు పరిధి దాటి వెళ్లకుండా చూస్తామని ధర్మాసనాని తెలిపారు సీనియర్​ న్యాయవాదులు. కక్షిదారులు ఇష్టానుసారం చర్చలు జరపకుండా, సామాజిక మాధ్యమాల్లో చర్చలకు తావివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సీజేఐ చెప్పిన అంశాలను పరిశీలనలోకి తీసుకోవాల్సిందేనన్నారు సీనియర్​ న్యాయవాది, కాంగ్రెస్​ నేత కపిల్​ సిబల్​.

విచారణ సందర్భంగా అన్ని పిటిషన్లకు సంబంధించిన నకలు పత్రాలు తమకు అందాయని కోర్టుకు తెలిపారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాలని, అందుకు కొంత సమయం కావాలని విన్నవించారు.

ఈ క్రమంలో విచారణను సోమవారానికి(ఆగస్టు 16) వాయిదా వేసింది ధర్మాసం.

ఇదీ చూడండి: కావాలని కేసు సాగదీత- కానిస్టేబుల్​కు రూ.లక్ష జరిమానా

Last Updated : Aug 10, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.