కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్ నుంచి పెట్రోల్ దొంగతనం (stealing petrol) చేస్తుండగా చూశాడని.. ఓ యువకుడిని దొంగ కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు.
![stealing petrol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mahaadev_3108newsroom_1630408228_989.jpg)
ఇనుప రాడ్డుతో కొట్టి...
మహదేవ కిచడి(28), ప్రవీణ్ సునధోహి.. గొకక్ జిల్లా బలోబల గ్రామానికి చెందినవారు. ఇటీవలే ఓ వాహనం నుంచి ప్రవీణ్ పెట్రోల్ దొంగలిస్తుండగా మహదేవ చూశాడు. దీంతో ప్రవీణ్.. ఇనుప రాడ్డుతో మహదేవపై దాడి చేశాడు. చివరికి మహదేవ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయాడు ప్రవీణ్.
![stealing petrol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/accused-praven_3108newsroom_1630408228_351.jpg)
నాలుగు రోజుల అనంతరం చెత్తకుప్ప నుంచి వాసన రావడం వల్ల అసలు విషయం బయటపడింది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. చివరికి ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ప్రవీణ్ నిజాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఘటప్రభ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చూడండి: బాలికపై సామూహిక అత్యాచారం- 10గంటల్లోనే పట్టుకున్న పోలీసులు