ETV Bharat / bharat

రూ.10 వేల కోసం కన్నబిడ్డను అమ్మిన తల్లిదండ్రులు - సొంత బిడ్డను అమ్మిన తల్లిదండ్రులు

రూ.10 వేల కోసం పదిరోజుల వయసు ఉన్న తమ బిడ్డను అమ్మేశారు ఒడిశాకు చెందిన దంపతులు. అయితే.. అధికారులు ఆ పసికందును రక్షించి, సంరక్షణ గృహానికి తరలించారు.

A newborn boy sold
కన్నబిడ్డనను అమ్మిన అమ్మానాన్న
author img

By

Published : Jun 20, 2021, 11:54 AM IST

పేదరికం కారణంగా.. పది రోజుల వయసు ఉన్న ఓ పసికందును కన్న తల్లిదండ్రులే అమ్మేశారు. ​ఒడిశా భువనేశ్వర్​లోని మాలిసాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రూ.10,000 కోసం ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని విక్రయించారని పోలీసులు తెలిపారు. జూన్​ 14న జరిగిన ఈ ఘటన.. శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

infant baby sold
పసికందును కొనుగోలు చేసిన మహిళ

నవజాత శిశువును కొనుగోలు చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళను సమేదిన్​ బీబీగా అధికారులు గుర్తించారు. చిన్నారిని కొనుగోలు చేసేందుకు తాను డబ్బులు చెల్లినట్లు సమేదిన్ ఒప్పుకుంది.

అనంతరం.. ఆ పసికందును పిల్లల సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ)కి అప్పగించారు అధికారులు. శిశువు అమ్మకానికి సంబంధించిన వీడియోను ఓ ఎన్​జీవో తమకు పంపించగా.. పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ నిర్వహించామని చైల్డ్​లైన్​ అధికారి బేనూదర్​ సేనాపతి తెలిపారు. పేదరికం వల్లే ఆ తల్లిదండ్రులు తమ శిశువును విక్రయించారని చెప్పారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ నివాస ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. వారిని వెతికే పనిలో ఉన్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: కుమార్తె చదువుకై.. తాను తడుస్తూ..

ఇదీ చూడండి: International Fathers day: తండ్రి అయ్యాకే తెలుస్తుంది.. నాన్న అంటే ఏమిటో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.