ETV Bharat / bharat

సరూర్​నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..

Honour killing in Gujarat: సరూర్​నగర్ తరహా పరువు హత్య కేసు గుజరాత్​లో కలకలం రేపింది. చెల్లి ప్రేమించిన వ్యక్తిని కొట్టి చంపాడు నిందితుడు సాకిర్. దీంతో యువతి ఆత్మహత్యకు యత్నించింది.

A Muslim girl got lost in 'Love' in Gujarat

author img

By

Published : May 12, 2022, 8:38 PM IST

Gujarat honour killing: హైదరాబాద్ సరూర్​నగర్​లో జరిగిన పరువు హత్య ఘటనను మరవక ముందే.. గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఇదే తరహా ఉదంతం జరిగింది. 22 ఏళ్ల యువకుడి ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. మిథున్ ఠాకూర్ (22) అనే యువకుడు సుమియా కాడివార్ (18) అనే ముస్లిం యువతిని ప్రేమించాడు.

Muslim Honour killing: వీరిద్దరూ కొన్ని నెలల నుంచి రిలేషన్ షిప్​లో ఉన్నారు. బిహార్​కు చెందిన మిథున్.. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ప్రేమలో పూర్తిగా మునిగితేలిన ఈ జంట.. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయం సుమియా ఇంట్లో తెలిసింది. సోమవారం ఉదయం మిథున్ ఠాకూర్.. సుమియాకు ఫోన్ చేయగా.. ఆమె సోదరుడు సాకిర్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే మిథున్​కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఫోన్​లోనే గొడవ పడ్డారు.

ఈ క్రమంలోనే సుమియా సోదరుడు సాకిర్.. మిథున్​పై దాడి చేశాడు. అతడి ఇంటికి వెళ్లి దారుణంగా కొట్టాడు. దీంతో మిథున్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని రాజ్​కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. గాయాలు తీవ్రంగా ఉండటం, తలకు గట్టి దెబ్బ తగలడం వల్ల మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్​కు తీసుకెళ్లారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు మిథున్.

A Muslim girl got lost in 'Love' in Gujarat
నిందితులు

మిథున్ మరణ వార్త వినగానే అతడి ప్రేయసి సుమియా ఆత్మహత్యకు యత్నించింది. బ్లేడుతో చెయ్యిని కోసుకుంది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ నేపథ్యంలో మిథున్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాకిర్​ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన మరొక వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. మిథున్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.