ETV Bharat / bharat

చిన్నారిని బాత్​టబ్​లో ముంచి ఉరి వేసుకున్న తల్లి - బిడ్డను హతమార్చిన తల్లి

Mother Killed Her Own Child కంటికి రెప్పలా కాపాడాల్సిన బిడ్డను ఆమె తల్లే అతి దారుణంగా హతమార్చింది. అనంతరం తాను కూడా మరణించాలని నిర్ణయించుకుని ఉరి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. మరోవైపు, ప్లాట్​ఫారమ్​పై నిద్రిస్తున్న భార్యను రైలు పట్టాల మీదకి తోసి కడతేర్చాడు ఓ భర్త. మహారాష్ట్రలో జరిగిందీ ఈ ఘటన.

suicide
murders
author img

By

Published : Aug 23, 2022, 12:03 PM IST

Updated : Aug 23, 2022, 12:47 PM IST

Mother Killed Her Own Child: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే తన చేతులారా హతమార్చింది. తర్వాత తాను తనువు చాలించాలనుకుని ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. అదే సమయానికి ఇంటికి వచ్చిన భర్త తల్లీపిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే బిడ్డ మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరులోని డొడ్డన్నకుడిలోని గురురాజా లేఅవుట్​లో గాయత్రి అనే మహిళ తన భర్త నరేంద్రన్​, మూడున్నరేళ్ల కుమార్తె సంయుక్తతో కలిసి నివాసం ఉంటోంది. నరేంద్రన్​.. జబ్బుపడ్డ తన తండ్రిని పరామర్శించడానికి వెళ్లాడు. భర్త ఇంట్లో లేకపోయేసరికి ఆమె బిడ్డను బాత్​టబ్​లో ముంచి హతమార్చింది. ఆ తర్వాత ఆమె ఒక సూసైడ్​ నోట్​ను అక్కడ పెట్టి ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన నరేంద్రన్​ తలుపు తట్టినా ఎవరూ రాకపోవడం వల్ల కిటికిలో నుంచి చూశాడు. ఫ్యాన్​కు వేలాడుతున్న గాయత్రిని చూసి నివ్వెరపోయిన అతడు.. వెంటనే తలుపులు బద్దలుకొట్టి ఆమెను కాపాడాడు.

పాప కోసం వెతకగా బాత్​టబ్​లో విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. గాయత్రి కోలుకున్న తర్వాత ఆమెను విచారిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరికిన సూసైడ్​నోట్​లో గాయత్రి.. "ఈ ఒత్తిడులను భరించే శక్తి నాకు లేదు. ఒక వేళ నేను చనిపోతే నా బిడ్డను చూసుకునేందుకు ఎవరూ ఉండరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అని రాసింది.

భార్యను కడతేర్చిన భర్త..
అంతసేపటి వరకు ప్లాట్​ఫాం​ మీద నిద్రిస్తూ ఉన్నారు ఆ కుటుంబసభ్యులు. ఇంతలో ట్రైన్​ వచ్చింది. నిద్రిస్తున్న తన భార్యను లేపి కదులుతున్న రైలు ముందుకు తోసేశాడు ఓ వ్యక్తి. తర్వాత తన పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే?.. పాల్ఘర్​ జిల్లా వాసాయ్​ రోడ్​ రైల్వేస్టేషన్​లో ఉదయం నాలుగు గంటల సమయంలో ఒక వ్యక్తి తన భార్యను ప్లాట్​ఫారం మీదకు ఈడ్చుకుని వెళ్లి రైలు పట్టాల మీదకు తోసేశాడు. బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. నిద్రిస్తున్న అతని పిల్లలను తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్​ చేశారు.

దారుణం జరిగిన కొంతసేపటి ముందు భార్యభర్తలు ప్లాట్​ఫాం​​పై గొడవపడినట్లు సీసీటీవీలో రికార్డయినట్లు తెలుస్తోంది. పోలీసులు అతడ్ని విచారించగా జరిగిందంతా వివరించాడు. తన స్నేహితుడితో కలిసి ఆమె రెండు రోజుల ముందు బయటకు వెళ్లిందని.. ఆ కోపంతోనే ఆమెను హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ఇదీ చదవండి: ఆటో ఎక్కుతుండగా విద్యార్థులకు కరెంట్​ షాక్​, ఒక్కసారిగా

చుట్టంగా వచ్చి ముగ్గురిని కిరాతకంగా చంపిన వ్యక్తి, ఆపై రక్తపు మడుగులో కూర్చొని

Last Updated : Aug 23, 2022, 12:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.