ETV Bharat / bharat

Gang rape: 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్​ రేప్​.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు - ముంబయి నేరాలు

Gang rape: 19 ఏళ్ల యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయిలోని శివాజీనగర్​లో జరిగింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లను అరెస్ట్​ చేశారు పోలీసులు. యువతిని ఆసుపత్రికి తరలించారు.

A minor girl was gang-raped by five to six men
బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారం
author img

By

Published : Jan 22, 2022, 5:48 PM IST

Updated : Jan 22, 2022, 9:51 PM IST

Gang rape: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణ ఘటన జరిగింది. ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున గోవండిలో ఈ దుర్ఘటన జరిగింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావటం గమనార్హం.

గోవండిలోని శివాజీనగర్​లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అరెస్ట్​ చేశారు పోలీసులు. మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మట్టిరోడ్​లోని స్లమ్​ ఏరియాలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు అత్యాచారం జరిగినట్లు చెప్పారు.

క్యాటరింగ్​ పనులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో యువతిని మాట్లాడాలని స్లమ్​ ఏరియాలోని ఓ గదికి తీసుకెళ్లాడు నిందితుల్లో ఒకడు. తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫోన్​ చేసి తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తికి రైలులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు మైనర్లను శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. వారిని విచారించగా మరొకరి ఆచూకీ లభించింది. అతన్ని కూడా అరెస్ట్​ చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కూతురిపై రేప్​- కోర్టు ఆవరణలోనే నిందితుడిని కాల్చి చంపిన తండ్రి!

Last Updated : Jan 22, 2022, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.