ETV Bharat / bharat

పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య! - ఉత్తర్​ప్రదేశ్​ అప్డేట్స్​

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. పది మంది భార్యలున్న అతడ్ని ఆస్తి కోసమే చంపినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

A man was killed by thugs in Uttar Pradesh, who got married 10 times
పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
author img

By

Published : Jan 24, 2021, 2:06 PM IST

Updated : Jan 24, 2021, 2:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన కోట్ల ఆస్తిపై కన్నేసిన వారే.. అతడ్ని హత్య చేసినట్టు తెలుస్తోంది.

భోజిపురాకు చెందిన జగన్​లాల్​ యాదవ్​(52) అనే రైతు.. తమ పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొంది కోటీశ్వరుడు అయ్యాడు. పది మంది భార్యలు కలిగిన అతడు.. ఆ ఆస్తిని తన దత్తపుత్రుడికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం అతడి పొలంలోనే గొంతుకోసి, తలపై రాడ్​తో కొట్టి చంపారు. ప్రధాన రహదారికి సమీపంలో అతడికి భూములు ఉండటం వల్ల.. వాటిపై కన్నేసిన దుండగుల ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు స్థానిక పోలీసు అధికారి మనోజ్​ కుమార్​ త్యాగి. అతడి గొంతు కోసి ఉండటం సహా.. తలకూ తీవ్రంగా గాయాలైనట్టు పోస్టుమార్టంలో తేలిందన్నారు త్యాగి. 10 మంది భార్యలున్న అతడికి, పిల్లలెవరూ లేరని స్థానికులు చెప్పినట్టు వెల్లడించారు. మొదటి భార్యకు చెందిన ఓ దత్తపుత్రుడు ఆ కుటుంబంతో ఉన్నట్టు వివరించారు త్యాగి.

జగన్​లాల్​కు 1990ల్లో తొలి వివాహం జరిగింది. ఆ తర్వాత ఐదుగురు భార్యలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. మరో ముగ్గురు అతడ్ని వదిలేసి వెళ్లిపోయారు. హత్యకు ముందు వరకు అతడు బంగాల్​కు చెందిన ఇద్దరు భార్యలతో ఉండేవాడట.

ఇదీ చదవండి: 'రూ.10 కోట్లు ఇవ్వకుంటే ఆ ఫొటోలు లీక్​ చేస్తాం'

Last Updated : Jan 24, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.