ETV Bharat / bharat

స్వప్నకుమారి.. సత్తిబాబు.. సునీత... ఏ ట్రయాంగిల్ మ్యారేజ్ స్టోరీ - ఒకే ముహూర్తానికి ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి

Man married two women at the same time in Bhadradri : ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం ఈమధ్య చాలా కామన్ అయిపోయింది. కాకపోతే ఒకరి గురించి మరొకరికి తెలియకుండా అబ్బాయిలు జాగ్రత్తపడుతున్నారు. ఇద్దరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అలెర్ట్‌గా ఉంటున్నారు. కర్మకాలి వాళ్లకు తెలిసిందా ఇక అంతే సంగతి. కానీ ఓ అబ్బాయి మాత్రం చాలా చలాకీగా ఆలోచించాడు. ఇద్దరమ్మాయిలను ఇష్టపడ్డాడు. ఒకేసారి ఇద్దరిపై మనసు పడటం తప్పేం కాదని.. ఆ ఇద్దరికీ తన ప్రేమ విషయం చెప్పాడు. ఆ అమ్మాయిలు కూడా ఈ అబ్బాయిని ప్రేమిస్తూ ఉండటంతో అతడిని విడిచి ఉండలేక కాంప్రమైజ్ అయ్యారు. అలా ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించి.. వారితో సహజీవనం చేసి.. ఇద్దరు బిడ్డలకు తండ్రికూడా అయ్యాడు. చివరకు వాళ్లిద్దరిని ఒకే మండపంలో.. ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా జరిగింది.. ఏ విదేశాల్లోనో కాదు.. మన ఇండియాలోనే.. అది కూడా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మరి ఈ ట్రయాంగిల్ లవ్/ మ్యారేజ్ స్టోరీ ఏంటో ఓసారి మీరూ తెలుసుకోండి.

Man married two women at the same time in Bhadradri
స్వప్నకుమారి.. సత్తిబాబు.. సునీత
author img

By

Published : Mar 9, 2023, 10:24 AM IST

Updated : Mar 9, 2023, 10:57 AM IST

Man married two women at the same time in Bhadradri :మీరు సినిమాలు బాగా చూస్తుంటారా..? అయితే ఇటీవల వచ్చిన కాతు వాకుల రెండు కాదల్ సినిమా చూశారా. అదేనండి మన తెలుగులో కన్మణి రాంబో ఖతీజా పేరుతో రిలీజ్ అయింది కదా ఆ సినిమా. ఈ మూవీలో హీరో విజయ్ సేతుపతి.. నయనతార(కణ్మని), సమంత(ఖతీజా) ఇద్దరిని ప్రేమిస్తాడు కదా. ఆ విషయం ఇద్దరికీ చెబుతాడు కూడా. ఇద్దరిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దానికి ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా ఓకే అంటారు. కానీ చివరలో బోల్తా కొడుతుంది. ఇద్దరు నువ్వే చేసుకో అంటే నువ్వే చేసుకో అని హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతారు. అలా హీరో డబుల్ లవ్‌ని మిస్ అయిపోతాడు.

Man married two women in Charla : ఇలాంటివి కేవలం సినిమాల్లోనే సాధ్యమని ఇన్నాళ్లు అనుకునేవాళ్లం. అయితే ఇప్పుడు కాలం మారింది. మనసుకు ఏం అనిపిస్తే అది చేయడం మనకు అలవాటై పోయింది. అలా కొందరు అబ్బాయిలు ఒకేసారి ఇద్దరిని ప్రేమిస్తున్నారు. మునపటిలాగా ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయలేక.. డైరెక్ట్‌గా ఇద్దరిపై మనసుపారేసుకున్నామని చెప్పేస్తున్నారు. అలా ఇద్దరమ్మాయిలపై మనసుపడ్డ ఓ యువకుడు వాళ్లిద్దరిని ఒకే ముహూర్తాన పెళ్లి చేసుకున్నాడు. మరి ఈ న్యూ ఏజ్ ట్రయాంగిల్ లవ్ కమ్ మ్యారేజ్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?

Man married two women in Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామలక్ష్మీల రెండో కుమారుడు సత్తిబాబు. గిరిజన కులాల్లోని యువతీ, యువకులు ఒకరికొకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేసే అవకాశముంది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సత్తిబాబు ఇంటర్ చదువుతున్న క్రమంలో దోసెల్లపల్లి గ్రామానికి చెందిన స్వప్న కుమారి అనే యువతిని ప్రేమించి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.

Man married two women at the same time in Bhadradri
స్వప్నకుమారి.. సత్తిబాబు.. సునీత

అదే క్రమంలో వరసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్న కుమారికి ఒక పాప పుట్టగా.. సునీతకు కూడా ఒక బాబు జన్మించాడు. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్యబాబును కోరగా ఇద్దరినీ ప్రేమిస్తున్నానని ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సత్తిబాబు నిర్ణయం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు యువతుల కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వారు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. మూడు ఊళ్ల పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి ముగ్గురి ఇష్టాఇష్టాలను అడిగి తెలుసుకుని వాళ్లిష్ట ప్రకారమే వివాహం చేయాలని నిర్ణయించారు.

అలా ఈ ముగ్గురి వివాహం ఇవాళ ఉదయం 7 గంటలకు జరగాల్సి ఉంది. అయితే వివాహ ఆహ్వాన పత్రిక బుధవారం రోజున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని బుధవారం రాత్రి సత్తిబాబు.. ఇద్దరమ్మాయిలను పెళ్లాడాడు.

Last Updated : Mar 9, 2023, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.