కర్ణాటక కొడగు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తుల్లో తన కాలును తానే నరుక్కున్నాడు. ఈ ఘటన విరజ్పేట్ తాలుకా కర్మాడు గ్రామంలో జరిగింది.

పాపన్న(45).. కుడికాలి పాదం నరుక్కుని.. మత్తు వదిలిన తర్వాత నొప్పిన భరించలేక బిగ్గరగా ఏడ్చాడు. దీంతో పాపన్నను చూసిన కుటుంబ సభ్యులు.. అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతను మెదికేరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కాలు నరుక్కోవడానికి కచ్చితమైన కారణం తెలియలేదు.
ఇదీ చూడండి: టీకా వేయించుకోమని చెబితే రాళ్లతో తరిమికొట్టారు!