దేశరాజధాని దిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్వర్జెన్స్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం 22 ఫైర్ ఇంజిన్లతో.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
బుధవారం రాత్రి 10.32 నిమిషాల సమయంలో ఆసుపత్రి భవనంలోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. ప్రమాదం జరిగిన తొమ్మిదో అంతస్తులో పలు లాబోరేటరీలు, అధునాతన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం