ETV Bharat / bharat

మెరిసిన పేదింటి విద్యా కుసుమం- ఒకేరోజు 20 గోల్డ్​ మెడల్స్​ - మైసూర్​ న్యూస్​

రైతు కుటుంబంలో పుట్టిన ఓ విద్యార్థిని చదువులో అద్భుత ప్రతిభ కనబరిచింది. అత్యంత కష్టమైన కెమెస్ట్రీ విభాగంలో యూనివర్సిటీలోనే అత్యధికంగా 20 బంగారు పతకాలు సాధించింది. ఆమే కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన చిత్ర నారాయణ్​ హెగ్డే.

ో
చిత్ర నారయణ్​ హెగ్డే, విద్యార్థిని
author img

By

Published : Sep 7, 2021, 7:35 PM IST

మట్టిలో మాణిక్యం, చదువుల తల్లి, విద్యా కుసుమం అనే పేర్లు.. ఈ విద్యార్థినికి సరిగ్గా సరిపోతాయి. రైతు కుటుంబంలో పుట్టి చదువులో అద్భుత ప్రతిభతో అందరి మన్ననలు పొందుతోంది. అంతే కాదండోయ్​.. అత్యంత కష్టమైన కెమెస్ట్రీ విభాగంలో యూనివర్సిటీలోనే అత్యధికంగా 20 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఆమే చిత్ర నారయణ్​ హెగ్డే.

Chitra Narayan hegde
విద్యార్థిని చిత్ర నారాయణ్​ హెగ్డే

కర్ణాటక, ఉత్తర కన్నడ జిల్లా సిర్సీ తాలూకలోని షీగేహళ్లి గ్రామానికి చెందిన విద్యార్థిని చిత్ర నారాయణ్​ హెగ్డే.. మైసూర్​ విశ్వవిద్యాలయంలోని కెమెస్ట్రీ విభాగంలో ఎంఎస్​సీ(మాస్టర్​ ఆఫ్​ సైన్స్​) చదువుతోంది. ఈ ఏడాది యూనివర్సిటీలో అత్యధిక మెడల్స్​ సాధించి తొలి స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన మైసూర్​ యూనివర్సిటీ 101వ స్నాతకోత్సవంలో 20 బంగారు పతకాలు సాధించింది. రాష్ట్ర గవర్నర్​ థావర్​ చంద్​ గెహ్లోత్​ చేతుల మీదగా పతకాలు అందుకుంది.

"1వ తరగతి నుంచి 10 వరకు కన్నడలో చదివాను. ఆ తర్వాత సైన్స్​ను ప్రధాన సబ్జెక్ట్​గా ఎంచుకున్నా. బీఎస్​సీ వరకు కొంచె కష్టంగా అనిపించింది. కానీ, నాకు కెమెస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఈ మెడల్స్​ సాధించటం చాలా సంతోషంగా ఉంది. ఈ పతకాలను నా తల్లిదండ్రులు, ప్రొఫెసర్స్​, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ అంకితం చేస్తున్నా. భవిష్యత్తులో మెడిసినల్​ కెమెస్ట్రీలో పరిశోధనలు చేయాలనుకుంటున్నా. "

- చిత్రా నారాయణ్​ హెగ్డే, విద్యార్థిని

తన స్వగ్రామంలోని విద్యార్థులకు ఓ సందేశం అందించింది విద్యార్థిని. ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నామని బాధపడకూడదని, మాతృభాషలోనే మాట్లాడుతూ చదువుల పట్ల మక్కువతో కష్టపడి చదివితే విజయం సాధ్యమవుతుందని సూచించింది.

ఇదీ చూడండి: పేదింటిలో వికసించిన విద్యా కుసుమం.. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.