తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి వినూత్నంగా ఓట్లను అభ్యర్థించారు. నియోజకవర్గంలో మోకాలి నొప్పితే బాధపడే వారికి.. తాను గెలిస్తే ఉచితంగా శస్త్రచికిత్స చేస్తానంటున్నారు. యువకులకు జల్లికట్టు కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిపారు.
మొదకురిచి అసెంబ్లీ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా సీకే సరస్వతి అనే డాక్టర్ పోటీ చేస్తున్నారు. "ఈ నియోజకవర్గంలో చాలామంది మోకాలినొప్పితో బాధపడుతున్నారని విన్నాను. తనని గెలిపిస్తే వారందరికి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తాను" అని సరస్వతి అన్నారు.
జల్లికట్టుకోటా కింద ప్రభుత్వ ఉద్యోగం
అంతేకాకుండా యువకులకు ఆధ్యాత్మిక పుస్తకాలను పరిచయం చేశారు. నీతి వాక్యాలను చెప్పారు. ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు శిక్షణ కూడా ఇప్పిస్తానని తెలిపారు. తమిళమార్షల్ ఆర్ట్స్ సిలంబమ్కు జాతీయ గుర్తింపు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
ఏప్రిల్6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు, మే2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇదీ చదవండి: తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!