Dalit boy hanged upside down: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దళిత యువకుడిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక భూస్వాములు అతడిని దారుణంగా కొట్టి.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. మజితా నియోజకవర్గంలోని కోట్ల సుల్తాన్ సింగ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే, యువకుడు దొంగతనం చేశాడని గ్రామస్థులు ఆరోపించారు.
atrocities on Dalit: బాధిత యువకుడిని పోలీసులు గుర్వేల్ సింగ్‌గా గుర్తించారు. భైనీ లిద్దర్ గ్రామానికి చెందిన గుర్వేల్ సింగ్.. విద్యుత్ వైర్లు, మీటర్లను దొంగతనం చేసేందుకు వచ్చాడని స్థానికులు ఆరోపించారని పోలీసులు తెలిపారు. అయితే, బాధితుడి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. దళితులు అయినందువల్లే తమ తమ్ముడిని కొట్టారని గుర్వేల్ సోదరుడు గుమ్మీజ్ సింగ్ ఆరోపించాడు. అనంతరం చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారని చెప్పారు. దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని తెలిపారు.
పోలీసులు వచ్చి బాధితుడిని కాపాడినా.. కేసు నమోదు చేసుకోవడంలో జాప్యం చేశారని గుమ్మీజ్ సింగ్ ఆరోపించారు. దర్యాప్తు పైనా పెద్దగా శ్రద్ధ చూపలేదని పోలీసులపై ధ్వజమెత్తారు. మరోవైపు, బాధితుడి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నామని స్టేషన్ హౌస్ అధికారి జగ్దీప్ సింగ్ పేర్కొన్నారు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దివ్యాంగుడిపై దాడి.. కర్రలతో విచక్షణా రహితంగా...