ETV Bharat / bharat

టీకా వికటించి ఎవరూ చనిపోలేదు: కేంద్రం - వ్యక్సినేషన్​ వార్తలు

కరోనా టీకా వికటించి దేశంలో ఎవరూ చనిపోలేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో చిన్న ప్రతికూల ఘటనలు మినహా ప్రజలు మరణించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. మూడో రోజు 1,48,266 మంది టీకా వేయించుకున్నట్లు తెలిపింది.

A cumulative of 580 Adverse Events Following Immunisation (AEFIs) have been reported. Of which 7 have been hospitalised: Health Ministry
టీకా వికటించి ఎవరూ చనిపోలేదు: కేంద్రం
author img

By

Published : Jan 18, 2021, 10:12 PM IST

కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్​పై వస్తున్న అపోహలను నమ్మొద్దని ప్రజలను కోరింది. జనవరి 16న ప్రారంభించిన వ్యాక్సినేషన్​ ప్రక్రియలో 580 ప్రతికూల ఘటనలను ప్రభుత్వం గుర్తించామని.. అస్వస్థతకు గురైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

మూడో రోజు 1.48 లక్షల మందికి..

మూడో రోజు దేశవ్యాప్తంగా మరో 1,48,266 మంది టీకా వేయించుకున్నట్లు వివరించింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు మొత్తం 3,81,305 మంది వ్యాక్సినేషన్​ క్రతువులో భాగం అయినట్లు తెలిపింది. నేడు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.48 లక్షల మంది టీకా వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అడిషినల్​ సెక్రెటరీ మనోహర్​ అగ్నాని తెలిపారు.

  • బిహార్​లో 8,656
  • అసోంలో 1,822
  • కర్ణాటకలో 36,888
  • కేరళలో 7,070
  • మధ్యప్రదేశ్​లో 6,665
  • తమిళనాడులో 7,628
  • తెలంగాణలో 10,352
  • బంగాల్​లో 11,588
  • దిల్లీలో 3,111

ఇదీ చూడండి: 'కొవిడ్‌ టీకాల పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.