ఇటీవల ముంబయిలో భారీ వర్షాలతో చిన్న నీటిగుంత ఓ కారును లోపలికి లాక్కున్న ఘటన గుర్తుందా? అదే తరహా ఘటన సోమవారం దిల్లీలో చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డులోకి పూర్తిగా దిగబడిపోయింది. దేశ రాజధాని నగరంలో భారీ వర్షాలతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. ఈ క్రమంలో ద్వారకాలోని సెక్టార్- 18లో రోడ్డు గుంతలా మారడంతో కారు లోపలికి జారిపోయింది.
-
A car got stuck after a road caved in Dwarka's Sector 18 due to incessant rain in the National Capital. It was later pulled out with the help of a crane. No injuries reported: Delhi Police#Delhi pic.twitter.com/GRjBfZLEXy
— ANI (@ANI) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A car got stuck after a road caved in Dwarka's Sector 18 due to incessant rain in the National Capital. It was later pulled out with the help of a crane. No injuries reported: Delhi Police#Delhi pic.twitter.com/GRjBfZLEXy
— ANI (@ANI) July 19, 2021A car got stuck after a road caved in Dwarka's Sector 18 due to incessant rain in the National Capital. It was later pulled out with the help of a crane. No injuries reported: Delhi Police#Delhi pic.twitter.com/GRjBfZLEXy
— ANI (@ANI) July 19, 2021
క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీసుకొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఫొటోలు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో దిల్లీలో రోడ్ల నాణ్యతపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి:'ఇలాంటి గుంతల రోడ్లు మనదేశంలోనే ఉంటాయా'