ETV Bharat / bharat

భారత్​-పాక్ సైన్యాధికారుల భేటీ

author img

By

Published : Mar 26, 2021, 4:55 PM IST

Updated : Mar 26, 2021, 5:23 PM IST

Indian Pakistan armies meeting, india pak meeting
భారత్​-పాక్ సైన్యాధికారుల భేటీ, భారత్​ పాక్ సమావేశం

16:47 March 26

భారత్​-పాక్ సైన్యాధికారుల భేటీ

భారత్​-పాకిస్థాన్​ సైన్యాల మధ్య పూంఛ్​-రావల్​కోట్ క్రాసింగ్ పాయింట్​ వద్ద బ్రిగేడ్​ కమాండర్​ స్థాయి సమావేశం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల డైరెక్టర్​ జనరల్స్​ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేసే విషయంపై సైన్యాధికారులు చర్చించారు.​

నియంత్రణ రేఖ వద్ద శాంతి స్థాపనే లక్ష్యంగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భారత్, పాకిస్థాన్​ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. రెండు దేశాల సైన్యాల డైరక్టర్​ జనరళ్ల స్థాయి చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. శాంతికి భంగం కలిగించి, హింసకు దారితీసే సమస్యలను పరిష్కరించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి​. అయితే ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతాయని భారత సైన్యం స్పష్టం చేసింది. సరిహద్దు వెంబడి.. పాక్​ సైన్యం సహాయంతో జమ్ముకశ్మీర్​లోకి చొరబడుతున్న వారిని అడ్డుకుంటామని పేర్కొంది.

Last Updated : Mar 26, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.