ETV Bharat / bharat

పోలీసు వాహనాల్లో ప్రసవించిన మహిళలకు సత్కారం - దిల్లీ పోలీసు వాహనాల్లో ప్రసవం

కరోనా లాక్​డౌన్ సమయంలో రవాణా సేవలు నిలిచిపోయిన వేళ.. దిల్లీ పోలీసు విభాగం 997 మంది గర్భిణీలను పోలీసు వాహనాల్లో ఆసుపత్రులకు తరలించింది. అంబులెన్స్​లు అందుబాటులో లేని సమయాల్లో పోలీసు కంట్రోల్​ రూమ్(పీసీఆర్) సిబ్బంది అమూల్యమైన సేవలందించారు. ఆ సమయంలో పోలీసు వాహనాల్లో ప్రసవించిన 9మందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నారు.

9 women who gave birth in PCR vans during lockdown to be honoured on Women's Day
పోలీసు వాహనాల్లో ప్రసవించిన ఆ 9 మందికి సత్కారం
author img

By

Published : Mar 8, 2021, 11:06 AM IST

కరోనా లాక్​డౌన్​ వేళ సేవలందించిన పోలీసులు ఎదుర్కొన్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎన్నో శ్రమలకోర్చి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో దిల్లీ పోలీసులు అంబులెన్స్​లు అందుబాటులో లేని సమయాల్లో నెలలు నిండిన 997 మంది గర్భిణీలను పోలీస్ కంట్రోల్​ రూమ్​(పీసీఆర్) వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు.

ఈ క్రమంలో 9 గర్భిణీలు పీసీఆర్​ వాహనాల్లోనే శిశువులకు జన్మనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ తొమ్మిది మంది మహిళలను దిల్లీ పోలీసు కమిషనర్ సోమవారం సత్కరించనున్నారు. కొత్తగా నిర్మించిన పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.

మరపురాని ఘటన..

గత ఏప్రిల్​లో దిల్లీ పాలం సమీపంలోని పంచవతి వద్ద ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోందని ఫోన్​ వచ్చింది. పోలీసులు చేరుకునేసరికే తల్లి గర్భం నుంచి శిశువు సగం బయటకు వచ్చింది. వెంటనే సమీపంలోని టీ షాపు మహిళ సహాయంతో గర్భిణీకి ప్రసవం చేశారు. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు సోనియా అని పేరు పెట్టారు. ఇప్పుడు సంవత్సరం వయస్సున్న ఆ చిన్నారికి నాడు పోలీసులు ప్రాణం పోశారు. ఇలా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు పోలీసులు.

పీసీఆర్ వ్యాన్లలో ప్రసవాలకు సహాయపడటం ద్వారా మా సిబ్బంది ఆదర్శప్రాయమైన పోలీసులుగా నిలిచారు. విధుల పట్ల అంకితభావాన్ని ప్రదర్శించారు. శిశు ప్రసవాల విషయంలో వారికి ఎలాంటి శిక్షణా లేనప్పటికీ అద్భుతంగా కృషి చేశారు. పోలీసు సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.

-ఇషా పాండే, పోలీసు కంట్రోల్​ రూమ్ డీసీపీ.

ఇదీ చదవండి: విస్తృత అవకాశాలతోనే అసమానతలు దూరం

జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసిటర్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.