ETV Bharat / bharat

పొడవైన రంగోలీ.. పోలింగ్​కు​ చూపించే దారి

ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు అసోంలోని సిల్​చార్​లో 8 కిలోమీటర్లు పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు.

Assam
పొడవైన రంగోలీ.. పోలింగుకు చూపించే దారి
author img

By

Published : Mar 16, 2021, 6:46 AM IST

Updated : Mar 16, 2021, 9:08 AM IST

త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో.. ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. కచర్ జిల్లా ప్రధాన కేంద్రం సిల్​చార్​లో 8.13 కిలోమీటర్లు పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. డిప్యూటీ కమిషనర్​గా పనిచేస్తున్న యువ ఐఏఎస్​ అధికారి కీర్తి జల్లి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్రతువులో సుమారు 3 వేల మంది పాలుపంచుకోవడం విశేషం.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తేయాకు తోటల కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్​ అధికారులు, సైనిక సిబ్బంది ఇలా అన్ని వర్గాల వారు ఇందులో మమేకమయ్యారు. ఆదివారం ఉదయం మొదలుపెట్టి 24 గంటల్లో దీన్ని సిద్ధం చేసినట్లు కీర్తి తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఓటింగ్​లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 4 కి. మీ రంగోలీనే భారత్​లో అత్యంత పొడవైనదిగా ఉందని, ఇప్పుడు ఈ రంగోలీతో ఆ రికార్డును అధిగమించామని కీర్తి తెలిపారు.

ఇదీ చదవండి : 'చైనా సరిహద్దులో 59 రహదారుల అనుసంధానం'

Last Updated : Mar 16, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.