ETV Bharat / bharat

'మృతులలో 88 శాతం మంది వారే' - టీకా పంపిణీ కార్యక్రమం

ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారికి ప్రారంభం కానున్న టీకా పంపిణీకి సరిపడా డోసులు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్ర, పంజాబ్​లలో కరోనా కేసులు పెరగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పంజాబ్‌లో జనాభా ప్రకారంగా చూస్తే ఎక్కువ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

corona
మహారాష్ట్ర, పంజాబ్‌లో కరోనా కేసులపై కేంద్రం ఆందోళన
author img

By

Published : Mar 24, 2021, 7:36 PM IST

ప్రస్తుతం కొవిడ్​ కారణంగా మృతి చెందుతున్న వారిలో 88 శాతం మంది 45 ఏళ్లు దాటిన వారేనని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. అందుకే ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రకటించామని పేర్కొంది. టీకా పంపిణీకి సరిపడా డోసులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5కోట్ల డోసులకుపైగా కరోనా టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ తెలిపారు. ​

ఆందోళన..

మహారాష్ట్ర, పంజాబ్‌లలో నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో రోజువారి కేసులు 28 వేలకుపైగా ఉన్నట్లు రాజేష్​ భూషణ్​ వెల్లడించారు. రెండో స్థానంలో ఉన్న పంజాబ్‌లో జనాభా ప్రకారంగా చూస్తే ఎక్కువ కేసులు వస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ రోజువారీగా 2వేలకుపైగా వైరస్ ‌కేసులు బయటపడుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్ ‌ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : కరోనా పంజా: భారత్​లో మరో కొత్త వేరియంట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.