Shanti Bai cycling: మనసు ఉత్సాహంతో ఉండి.. చేయాలన్న సంకల్పం ఉంటే ఏ పనికీ వయసు అడ్డంకి కాదని మరోసారి రుజువు చేశారు మధ్యప్రదేశ్‌కు చెందిన శాంతిబాయి. 81 ఏళ్ల వయసులో యువకులకు దీటుగా చురుగ్గా అన్ని పనులూ స్వయంగా చేసుకుంటున్నారు.

81 year old cycling 20 km
శాంతి బాయికి ఇద్దరు కుమార్తెలు. వివాహం తర్వాత తల్లికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఒంటరిగానే జీవిస్తున్నారు శాంతిబాయి. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి బయల్దేరతారు. పొట్టకూటి కోసం పలువురి ఇళ్లలో పనులు చేసి సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తారు. ఎక్కడికి వెళ్లినా సైకిల్‌పైనే వెళ్తారు. ఓ కిలోమీటరు దూరం నడిచేందుకే చాలా మంది అలసిపోతారు. కానీ శాంతిబాయి మాత్రం రోజుకు 20 నుంచి 22 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతారు.


Old Woman cycling news
అనేక విషయాల్లో శాంతిబాయి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటి యువతకు చిన్నతనం నుంచే కంటి చూపు మందగిస్తోంది. కానీ 81 ఏళ్ల శాంతి బాయి.. ఇప్పటికీ కళ్లజోడు ఉపయోగించరు. తనకు కంటి సమస్యలేం లేవని, అన్నీ స్పష్టంగా చూడగలుగుతానని చెబుతున్నారు. బయట ఇళ్లలో పనిచేయడమే కాకుండా.. ఇంట్లోనూ అన్ని పనులూ స్వయంగా చేసుకుంటారు. ఈ వయసులోనూ ఎవరికీ భారం కాకుండా ఉన్నందుకు గర్వపడతానని చెబుతుంటారు శాంతిబాయి.

ఇదీ చదవండి: ఇంట్లో నుంచి గెంటేసిన బిడ్డలపై 76 ఏళ్ల తల్లి పోరాటం.. చివరకు..