ETV Bharat / bharat

ఒకే ఆసుపత్రిలో 80మంది సిబ్బందికి కరోనా.. వైద్యుడు మృతి - దిల్లీ సరోజ్​ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​

దిల్లీలోని ఓ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఓ వైద్యుడు వైరస్​కు బలయ్యారు. మృతి చెందిన వైద్యుడు రెండు నెలల క్రితమే టీకా రెండో డోసు తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Saroj Super specialty Hospital
కొవిడ్​ ఆసుపత్రి
author img

By

Published : May 10, 2021, 3:16 PM IST

కరోనా కట్టడిలో ముందుండి సేవలందించే వైద్య సిబ్బంది వైరస్​ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలోని సరోజ్​ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఓ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వైద్యుడు డాక్టర్​ ఏకే రావత్​ రెండు నెలల క్రితమే వ్యాక్సిన్​ తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

" మార్చి తొలి వారంలోనే డాక్టర్​ రావత్​ వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నారు. ఆ తర్వాత వైరస్​ బారినపడ్డారు. కరోనా నిర్ధరణ కాగానే హోంఐసోలేషన్​కు వెళ్లారు. ఆరోగ్యం క్షీణించిన క్రమంలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. "

- డాక్టర్​ పీకే భరద్వాజ్​, ఆసుపత్రి చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​

వైరస్​ బారిన పడిన 80 మందిలో వైద్యులు, నర్సులు, వార్డ్​ బాయ్స్​, ఇతర సిబ్బంది ఉన్నట్లు భరద్వాజ్​ తెలిపారు. అందులో చాలా మంది సిబ్బంది ఆసుపత్రుల్లో చేరారు. ఇంకా కొంత మంది హోంఐసోలేషన్​లో ఉన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.