ETV Bharat / bharat

8 Year Old Girl Kidnapped and Raped : 8ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి.. - కేరళలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

8 Year Old Girl Kidnapped and Raped : 8 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి, అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. గాయపడిన ఆ చిన్నారిని వరిపొలంలో వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువాలో జరిగింది. మరోవైపు 29ఏళ్ల బాయ్​ఫ్రెండ్​ను దారుణంగా కత్తితో పొడిచి చంపింది 34ఏళ్ల మహిళ. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

8-year-old-girl-kidnapped-raped-in-kerala-she-abducted-while-sleeping-beside-her-parents
కేరళలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 12:13 PM IST

Updated : Sep 7, 2023, 2:05 PM IST

8 Year Old Girl Kidnapped and Raped : కేరళలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. రాత్రి వేళ తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు ఎవరో ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి కేరళ ఎర్నాకుళం జిల్లా అలువాలో జరిగింది.

నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి..
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బాధిత బాలిక కుటుంబం పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చి అలువాలో ఉంటోంది. ఆ చిన్నారి బుధవారం రాత్రి తల్లిదండ్రుల పక్కన నిద్రపోతుండగా.. ఒక వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. గాయపడిన చిన్నారిని స్థానికుల్లో ఒకరు.. వరిపొలంలో చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని కలామస్సెరి మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు.

"బుధవారం రాత్రి 2 గంటల సమయంలో బాధితురాలిని.. అనుమానితుడితో కలిసి స్థానిక వ్యక్తి ఒకరు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోగా స్థానికులు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు ఎవరో బాధితురాలు గుర్తు పట్టింది. అతడి కోసం గాలిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తాం. నిందితుడు.. కేరళకు చెందిన వ్యక్తే" అని వెల్లడించారు ఎర్నాకుళం జిల్లా ఎస్​పీ వివేక్ కుమార్. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.

బాయ్​ఫ్రెండ్​ను పొడిచి చంపిన మహిళ..
Woman Killed Live in Partner : 29ఏళ్ల బాయ్​ఫ్రెండ్​ను దారుణంగా కత్తితో పొడిచి చంపింది 34ఏళ్ల మహిళ. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మృతుడు కేరళలోని కన్నూర్​కు చెందిన జావెద్(29). ఓ మొబైల్ రిపేర్ షాప్​లో పనిచేసేవాడు. నిందితురాలు రేణుక(34). ఆమెకు 8 ఏళ్ల కూతురు ఉంది. జావెద్, రేణుకకు మూడున్నర ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వారు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

బెంగళూరులోని హులిమావు ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​లో 3 రోజుల కోసం రియాజ్ అనే పేరుతో బుక్ చేసిన ఫ్లాట్​లో ఈనెల 2న జావెద్, రేణుక దిగారు. మంగళవారం మధ్యాహ్నం 3.15కు ఇద్దరికీ గొడవ అయింది. అపార్ట్​మెంట్ మేనేజర్ సునీల్ వెళ్లి చూడగా.. జావెద్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. స్థానికుల సాయంతో సునీల్ అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధరించారు. హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Udhayanidhi Stalin Statement on Sanatana Dharma : 'మణిపుర్​, అవినీతి నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ.. కోర్టుల్లోనే తేల్చుకుంటా'

Yogi Adityanath Twitter Followers : పవర్​ఫుల్​ 'యోగి'.. మోదీ, షా తర్వాత ప్లేస్ ఆయనదే.. ఇదిగో కొత్త లెక్క!

Last Updated : Sep 7, 2023, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.