బిహార్ కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్సిలా ప్రాంతంలో ట్రక్కు- కారు ఢీకొనడం వల్ల 8మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సాదర్ ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ తప్పిదమేనా?
ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మృతులతో పాటు గాయపడిన వారు బంగాల్వాసులని సమాచారం. బంగాల్లో వివాహ వేడుకకు హాజరై.. తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రమాదం జరిగిన గంటల పాటు.. గాయపడినవారు స్కార్పియోలోనే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని సమాచారం.