ETV Bharat / bharat

7th Pay Commission DA Hike : ఆ ఉద్యోగులకు భారీగా డీఏ పెంపు.. దివాళీ గిఫ్ట్​తో ఉద్యోగుల సంబరాలు!

DA Hike in These States : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి పండగ ముందర కొన్ని రాష్ట్రాలు కూడా.. తమ ఉద్యోగులకు డీఏ పెంచి పండగ గిఫ్ట్​గా అందిస్తున్నాయి. ఇంతకీ ఏయే రాష్ట్రాలు ఎంత మేర కరవు భత్యం (DA) పెంచాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

DA
DA Hike
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 4:01 PM IST

Several States Hiked DA for Govt Employees : కేంద్రం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు డియర్​నెస్ అలవెన్స్(DA) పెంచిన విషయం తెలిసిందే. దసరా బొనాంజగా 4% మేర డీఏ పెంచింది. ఇప్పుడు అదే బాటలో.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు దీపావళి బహుమతిగా డీఏ అందిస్తున్నాయి. దీంతో.. అక్కడి ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

DA Hike Latest Update : సంవత్సరానికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ)ను పెంచుతారు. ప్రభుత్వం పరిస్థితులను బట్టి దీనిని వాయిదా వేయవచ్చు. సాధారణంగా ఆరు నెలల్లో డీఏ విడుదలవుతుంది. అంటే మొదటి డీఏ పెంపు జనవరిలో, రెండోది జూలైలో పెంచుతారు. అధిక ద్రవ్యోల్బణంతో ధరలు పెరుగుతున్న క్రమంలో.. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు డీఏ పెంచుతాయి. ఇటీవల కేంద్రం ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంచగా.. దీపావళి(Diwali) వస్తున్న క్రమంలో ఇప్పుడు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు డీఏ పెంచి దివాళీ బోనస్​ అందిస్తున్నాయి. ఏ రాష్ట్రాల్లో ఎంత మేర డీఏ పెరిగిందో ఇప్పుడు చూద్దాం.

తమిళనాడు ఉద్యోగులకు డీఏ : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వ ఉద్యోగులకు 4% DA పెంచారు. జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో దాదాపు 16 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు ఈ ఏడాది మేలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 4 శాతం పెంచగ్గా.. తాజాగా 4% డీఏ పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది.

ఒడిశా సర్కారు కూడా : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ఉద్యోగులకు కరువు భత్యాన్ని 4% పెంచారు. ఈ పెంపుతో డీఏ, డీఆర్‌లు 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగాయి. పెంచిన డీఏ జూలై 1, 2023 నుంచి వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ డీఏ పెంపు వల్ల ఒడిశాలోని 4.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. 3.5 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

7th Pay Commission News : రైల్వే ఉద్యోగులకు పండగ.. భారీగా బోనస్ ప్రకటించిన కేంద్రం!

కర్ణాటకలో ఎంత శాతం పెరిగిందంటే..? కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3.75 శాతం పెంచింది. కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 35 శాతం నుంచి 38.75 శాతానికి సవరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అదనంగా రూ.1,109 కోట్లు వెచ్చించనుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ప్రాథమిక వేతనాన్ని 17% వరకు పెంచింది.

7th Pay Commission DA Hike : ఉద్యోగులకు డీఏ పెంపుతో.. వేతనం ఎంత పెరుగుతోంది..?

DA For TSRTC Employees : టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. 4.8 శాతంతో మరో డీఏ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.