ETV Bharat / bharat

42 ఏళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం.. టీచర్​కు 25 ఏళ్ల జీతం - బంగాల్ టీచర్​

25 Years salary for teacher: 42 ఏళ్లు న్యాయపోరాటం చేసి విజయం దక్కించుకుంది ఓ టీచర్. అకారణంగా ఆమెను విధులకు హాజరుకానివ్వనందుకు 25 ఏళ్ల జీతం చెల్లించాలని పాఠశాల యాజమాన్యాన్ని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది.

76-year-old school teacher gets justice after 42 years
42 ఏళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం.. 25 ఏళ్ల జీతం చెల్లించాలని కోర్టు ఆదేశం
author img

By

Published : May 5, 2022, 8:20 PM IST

School teacher gets justice: తీర్పును ఆలస్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే అంటుంటారు. కానీ బంగాల్​లో 72 ఏళ్ల ​ ఓ టీచర్ విషయంలో మాత్రం తీర్పు ఆలస్యమైనా న్యాయం ఆమె పక్షానే నిలిచింది. 42 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి విజయం దక్కించుకుంది. శ్యామలి ఘోష్​ అనే టీచర్​ 1976లో షాపుర్​లోని ఓ పాఠశాలతో టీచర్​గా జాయిన్ అయ్యారు. కానీ ఆ తర్వాత నాలుగేళ్లకే పరిస్థితులు తలకిందులయ్యాయి. 1980 నుంచి ఆమెను పాఠశాలకు రానివ్వకుండా హెడ్​మాస్టర్ నిరాకరించారు. ఆమె ఆరేళ్ల పాటు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 1986లో కోల్​కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్యామలి. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పు రాకముందే 2005 నవంబర్​ 30న ఆమె పదవీవిరమణ పొందారు. పాఠశాలకు హాజరు కాకుండానే రిటైర్​ అయ్యారు.

West bengal teacher: అయితే 2013లో శ్యామలకు రావాల్సిన జీతాన్ని చెల్లించాలని పాఠశాలను ఆదేశించింది హైకోర్టు. ఆమెను డిస్​మిస్​ చేయలేదు కాబట్టి పెన్షన్​ కూడా అందివ్వాలని తెలిపింది. కోర్టు ఆదేశాల తర్వాత బంగాల్​ ప్రభుత్వం శ్యామలకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఆమెకు ఇవ్వాల్సిన జీతాన్ని మాత్రం చెల్లించలేదు. దీంతో శ్యామల మరోసారి కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోల్​కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అభిజిత్ గుంగూలీ కీలక తీర్పు వెలువరించారు. శ్యామలకు 25 ఏళ్ల జీతంతో(1980-2005) పాటు దానికి 10 శాతం వడ్డీ జత చేసి చెల్లించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. 8 వారాల్లోగా ఇది జరగాలని తేల్చి చెప్పారు. అనంతరం తదపరి విచారణను జూన్ 21కి వాయిదా వేశారు.

Calcutta High Court: హెడ్​మాస్టర్​ తన సన్నిహితులకు టీచర్ పోస్టు ఇవ్వాలని భావించాడని, కానీ శ్యామలకు ఆ అవకాశం దక్కడం వల్ల అతను ఆమెపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే టీచర్​ను పాఠశాలకు రానివ్వలేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఏది ఏమైనా 42 ఏళ్లకైనా న్యాయం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. న్యాయపోరాటంలో తమకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: 13 రోజుల తర్వాత విడుదలైన నవనీత్​ రాణా దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.