70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటకలోకి కలబురగిలో జరిగింది. అత్యాచార నిందితుడు సంతోశ్‌ను అలంద్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూర్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. బాధితురాలి స్వస్థలం లడముగులి కాగా.. అన్నూర్‌లోని తన మనమరాలి ఇంట్లో ఉంటోంది. వృద్ధురాలిని ఇంట్లో వదిలి ఆమె మనవరాలు బయటకు వెళ్లింది. అయితే ఎవరూ లేని సమయంలో వృద్ధురాలిపై ఆమె పొరుగుంటి యువకుడు సంతోశ్(28) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి మనవరాలు ఇంటికి వచ్చేసరికి అసలు విషయం బయటపడింది. వృద్ధురాలి మనవరాలి ఫిర్యాదు మేరకు అలంద్ పోలీసులు నిందితుడు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వేడి పాత్రలో పడి..
ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో దారుణం జరిగింది. పుట్టు వెంట్రుకలు తీసే వేడుకలో విషాదం నెలకొంది. ఈ వేడుకలో ఐదేళ్ల బాలుడు.. వేడి పాత్రలో పడి మరణించాడు. ఆదివారం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది.. సైదంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరణ్‌పుర్ సుతారి గ్రామానికి చెందిన భరత్ సింగ్.. గంగా ఘాట్‌లో తన ఐదేళ్ల కుమారుడు సుశీల్‌కు పుట్టు వెంట్రుకలు తీయించాడు. ఈ సందర్భంగా ఆయన బంధువులకు విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు వండిన వంటలను ఓ గదిలో ఉంచారు. సుశీల్ ఆడుకుంటూ వంటపాత్రల పక్కన ఉన్న మంచం ఎక్కాడు. అంతలో అదుపుతప్పి వేడిగా ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో బాలుడి శరీరంగా తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటిన బాలుని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుని పరిస్థితి విషమంగా ఉందని.. మేరఠ్ తరలించాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు.
మైనర్‌పై రేప్..
ఉత్తర్‌ప్రదేశ్ మథురాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు 60 ఏళ్ల వృద్ధుడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. మైనర్‌ను వృద్ధుడు ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లోకి కొవ్వొత్తిని చొప్పించాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో తనపై జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో వ్రిందావన్ పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. పోలీసులు తనపై కేసు నమోదు చేసుకున్నారని తెలిసిన నిందితుడు విషం తాగేశాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నిందితుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
గర్భిణీపై గ్యాంగ్‌రేప్.. గర్భిణీపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌లో జరిగింది. జులై 16న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిందితులిపై కేసు నమోదు చేసుకోలేదు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదుచేశారు. భర్తకు భోజనం ఇచ్చి ఇంటికి వస్తుండగా తనను కత్తితో బెదిరించి ఇద్దరు వ్యక్తులు చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఇవీ చదవండి: పుట్టినరోజున అడ్వాణీకి శుభాకాంక్షల వెల్లువ.. స్వయంగా ఇంటికి వెళ్లిన మోదీ
'చట్టానికి లోబడే తీర్పు'.. అత్యాచార దోషులకు శిక్ష రద్దుపై సుప్రీం వివరణ