ETV Bharat / bharat

ఆమెకు 67.. అతడి వయసు 28.. నోటరీ చేయించిమరీ సహజీవనం! - 28 ఏళ్ల యువకుడిని ప్రేమించిన వృద్ధురాలు

జిల్లా కోర్టుకు నోటరీ కోసం వచ్చిన ఓ జంటను చూసి షాక్​ అయ్యారు అక్కడివారు. తాము సహజీనం చేస్తున్నామంటూ నోటరీ చేయించుకుంది ఆ జంట. ఇందులో వింత ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్​. ఆ జంటలో అబ్బాయి వయసు 28 ఏళ్లు అయితే అతని భాగస్వామి వయసు 67 ఏళ్లు!

Real love story in gwalior
మధ్యప్రదేశ్​ గ్వాలియర్
author img

By

Published : Mar 24, 2022, 4:05 PM IST

ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ ఉంటారు. ఇప్పుడు ఆ మాటను నిజం చేసిందో జంట. 67 ఏళ్ల వృద్ధురాలు 28 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజ జీవనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని మోరేనా జిల్లా కైలారస్​లో వెలుగు చూసింది.

d
రామ్​కాళి-భోలు జంట చేయించుకున్న నోటరీ

ఒకే ప్రాంతంలో నివసిస్తున్న 67 ఏళ్ల రామ్​కాళి, 28 ఏళ్ల భోలు.. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వీరు.. సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి బంధంపై ఎలాంటి వివాదం తలెత్తకుండా నోటరీ చేయించుకోవాలని భావించింది ఆ జంట. గ్వాలియర్​ జిల్లా కోర్టుకు వెళ్లి.. తమ సహజీవనాన్ని గుర్తించేందుకు నోటరీ చేయించుకుంది. సహజీవనంలో ఉన్నవారు ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు ఇలా నోటరీలు చేయించుకుంటారని.. కానీ ఇలాంటి పత్రాలు అధికారికంగా చెల్లవని స్థానిక న్యాయవాది​ ప్రదీప్​ అవస్థీ వెల్లడించారు.

ఇదీ చూడండి : భార్యలను మార్చుకున్న స్నేహితులు.. చివరకు దిమ్మతిరిగే షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.