ETV Bharat / bharat

ఆమె కడుపులో రూ.3కోట్లు విలువైన డ్రగ్స్.. వారం కష్టపడితే...

క్యాప్సుల్స్​ రూపంలో పొట్టలో దాచి మత్తుపదార్థాలను తరలిస్తున్న ఉగాండా మహిళను ముంబయి విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్​ చేశారు. వారం రోజుల్లో మొత్తం 64 క్యాప్సుల్స్​ బయటకు తీశారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.కోట్లలోనే ఉంటుందని తెలిపారు.

DRUGS
హెరాయిన్​ క్యాప్సుల్స్​
author img

By

Published : Jun 3, 2022, 7:03 PM IST

మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులో భాగంగా ఉగాండాకు చెందిన ఓ మహిళను ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్​ చేశారు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారులు. ఆమె కడుపులో 535 గ్రాముల 49 హెరాయిన్​ క్యాప్సుల్స్​, 174 గ్రాముల 15 కొకైన్​ క్యాప్సుల్స్​ను గుర్తించి.. బయటకు తీశారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లకుపైనే ఉంటుందని తెలిపారు.

ఉగాండా నుంచి వస్తున్న మహిళ అనుమానాస్పదంగా ఉందన్న పక్కా సమాచారంతో మే 28న ప్రత్యేక ఆపరేషన్​ నిర్వహించారు అధికారులు. ముంబయి విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. క్యాప్సుల్స్​ రూపంలో డ్రగ్స్​ను శరీరంలో దాచి తీసుకురావచ్చనే అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దాంతో 11 క్యాప్సుల్స్​లో మింగినట్లు అంగీకరించింది. 110 గ్రాముల 10 హెరాయిన్​ క్యాప్సుల్స్​ను వెలికితీశారు. అనంతరం మిగిలిన వాటిని తీసేందుకు మహిళను బెకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించారు.

DRUGS
హెరాయిన్​ క్యాప్సుల్స్​

ఆసుపత్రిలో.. మొత్తంగా ఆమె పొట్టలోంచి 54 క్యాప్సుల్స్​ బయటకు తీశారు వైద్యులు. అందులో 425 గ్రాముల 39 హెరాయిన్​ క్యాప్సుల్స్​, 175 గ్రాముల 15 కొకైన్​ క్యాప్సుల్స్​ ఉన్నాయి. పట్టుబడిన రోజు తీసిన 10 క్యాప్సుల్స్​ కలుపుకొని మొత్తం 64 డ్రగ్స్ క్యాప్సుల్స్​ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మహిళను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేసి ఎన్​సీబీ ఆఫీస్​కు తరలించారు. ఈ డ్రగ్స్​ అక్రమ రవాణాలో ఎవరెవరున్నారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 'వీడొక్కడే' సీన్​ రిపీట్​- కడుపులో హెరాయిన్​ క్యాప్సుల్స్​తో..

బిందు 'వింత పెళ్లి'కి ఆదిలోనే ఆటంకం.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.