ETV Bharat / bharat

COVID: మోదీ పనితీరుపై 63% మంది విశ్వాసం!

దేశంలో కొవిడ్ పరిస్థితులను మోదీ సర్కారు ఎదుర్కొంటున్న తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రజల్లో మోదీ క్రేజ్​, భాజపాపై నమ్మకం తగ్గిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కొవిడ్​ పరిస్థితులను ఎదుర్కోవటంపై ఓ సర్వేలో మోదీకి 63 శాతం ప్రజలు మద్దతు పలికారు.

modi, rahul
మోదీ, రాహుల్
author img

By

Published : May 30, 2021, 5:01 AM IST

మోదీ క్రేజ్​తో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపాకు కొవిడ్​ మహమ్మారితో విమర్శలు ఎదురవుతున్నాయి. వైరస్​ను ఎదుర్కోవటంలో మోదీ సర్కారు విఫలమైందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మోదీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొవిడ్​ రెండో దశ కట్టడిలో కేంద్రం తీరు ఇందుకు ఆజ్యం పోస్తోంది. ఈ క్రమంలో కొవిడ్​ను ఎదుర్కోవటంపై ఏబీపీ-సీ సంస్థ సర్వే నిర్వహించింది.

కొవిడ్​ను సమర్థవంతంగా మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటోందని 63 శాతం మంది తెలిపినట్లు సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో రాహుల్​ గాంధీకి 22 శాతం మాత్రమే ప్రజాదరణ లభించటం గమనార్హం.

63 శాతం మంది మద్దతు మోదీకే..

  • ప్రధాని మోదీ ఈ పరిస్థితులను బేషుగ్గా ఎదుర్కొన్నారని 63.1 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • 65.8 శాతం పట్టణ ప్రాంత వాసులు, 61.9 శాతం మంది గ్రామీణ ప్రాంతీయులు మోదీకే మద్దతు పలికారు.
  • మే 23 నుంచి మే 27 మధ్య 12,070 మందిని సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది ఏబీపీ-సీ సంస్థ.
  • ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను రాహుల్​ గాంధీ సరైన రీతిలో ఎదుర్కొనేవారని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • రాహుల్ గాంధీ ప్రధాని అయి వుంటే కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే తీరు మరింత మెరుగ్గా ఉండేదని.. 20.1 శాతం మంది పట్టణ ప్రాంతీయులు పేర్కొన్నారు. 22.8 శాతం గ్రామీణులు ఇదే విధంగా అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.