ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మరో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 142 మంది గల్లంతవ్వగా.. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు వివరించారు. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు.. చమోలీ జిల్లా జోషిమఠ్‌లోని తపోవన్ సొరంగ మార్గంలో సహాయక చర్యలు చేపట్టాయి.
ఇదీ చదవండి: శిథిలాల కుప్పతో రిషిగంగకు మరో ముప్పు!
జోషిమఠ్ వద్ద నందాదేవి హిమానీనదం బద్దలవ్వడం వల్ల రిషిగంగ నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా సంగమం వద్ద ఉన్న ఎన్టీపీసీకి చెందిన మరో జల విద్యుత్ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది.
ఇవీ చదవండి: