ETV Bharat / bharat

14 ఏళ్ల దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. 60 ఏళ్ల వృద్ధుడు కూడా... - దళిత బాలికపై అత్యాచారం

Madhya Pradesh gang rape: 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కిరాతకులు. నిందితుల్లో 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. బాలిక అస్వస్థతకు గురైన తర్వాత వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Madhya Pradesh gang rape, మధ్యప్రదేశ్ గ్యాంగ్ రేప్​
14 ఏళ్ల దివ్యాంగురాలిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
author img

By

Published : Dec 31, 2021, 7:37 PM IST

Madhya Pradesh gang rape: మధ్యప్రదేశ్​లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల దివ్యాంగ, దళిత బాలికపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వైద్య పరీక్షల్లో అసలు విషయం..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం బాలిక అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని గమనించిన అంగన్​వాడీ కార్యకర్త.. ఆశా వర్కర్​ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె బాలికను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. బాలిక పరిస్థితిని చూసిన వైద్యులు మవూ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లాక వైద్య పరీక్షలు చేస్తే అసలు విషయం బయటపడింది. బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వారు బాలికపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదు చేశారు. సంజ్ఞల నిపుణుడ్ని తీసుకొచ్చి బాలికతో నిందితుల వివరాలు సేకరించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిలో ఓ వ్యక్తి బాలిక పొరుగింట్లోనే ఉంటున్నట్లు తెలుసుకుని అతనితో పాటు 60 ఏళ్ల వృద్ధుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి పేర్లు శివ(45), చేతన్(60) అని వెల్లడించారు. ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.

ఈ ఘటనపై మవూ అదనపు సూపరింటెండెంట్ పునీత్ గహ్లోత్​, సీనియర్ పోలీస్​ అధికారులు విచారణ చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.

ఇదీ చదవండి: దేశంలో 'ఒమిక్రాన్' విజృంభణ.. డెల్టాను మించి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.