రాజస్థాన్ దౌసా జిల్లా మురళిపుర గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఈ వివాహ వేడుకకు 100 మందికి పైగా హాజరయ్యారు. బాధితులలో కొందరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉన్న వారిని సికరేయ్లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం..
వివాహ వేడుకలకు 50 మందే హాజరవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ వేడుకకు 100 మందికిపైగా హాజరయ్యారు. విందు భోజనం తర్వాత అస్వస్థతకు గురైన బాధితులు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా అక్కడే ఉన్న ఓ డాక్టర్ సాయంతో చికిత్స పొందారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించామన్న కారణంతో వైద్య అధికారులకు భయపడి బాధితులు వారిని సంప్రదించనట్టు తెలుస్తోంది. కానీ పరిస్థితి విషమించడం వల్ల స్థానికులు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న సిబ్బంది చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని సికరేయ్లోని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : రాజస్థాన్లో 5.3 తీవ్రతతో భూకంపం