ETV Bharat / bharat

మరో మెడికల్​ కాలేజీలో కరోనా కలకలం.. ఆ ఏడుగురికి.. - చామరాజ్ నగర్ మెడికల్​ కాలేజీలో కరోనా

కర్ణాటకలోని చామరాజ్​నగర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​​కు(సీఐఎంఎస్​) చెందిన ఆరుగురు విద్యార్థులు, ఓ ఇంటర్నీకి కరోనా(Corona in medical college ) సోకినట్లు తేలింది. ఈ విద్యార్థులంతా కళాశాల వసతి గృహంలో ఉండటం వల్ల ఆందోళన నెలకొంది.

karnataka Chamarajanagar medical college corona
కర్ణాటక మెడికల్​ కాలేజీలో కరోనా
author img

By

Published : Nov 29, 2021, 8:07 PM IST

కర్ణాటక(karnataka corona cases ) ధార్వాడ్​ జిల్లాలోని ఎస్​డీఎమ్ వైద్య కళాశాలలో కరోనా కలకలం సృష్టించిన కొన్ని రోజులకే.. మరో మెడికల్​ కాలేజీలో కొవిడ్​ వ్యాపించింది. చామరాజ్​నగర్ జిల్లాలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​​కు(సీఐఎంఎస్​)(corona in medical college) చెందిన ఆరుగురు విద్యార్థులు సహా ఓ ఇంటర్నీకి కొవిడ్​ సోకినట్లు తేలింది. వైరస్ సోకిన విద్యార్థులను జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

వైరస్​ బాధితులంతా సీఐఎంఎస్​లోని(Cims corona) వసతి గృహంలో ఉంటున్నారని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్​ విశ్వేశ్వరయ్య తెలిపారు.

"సీఐఎంఎస్ వసతి గృహంలో ఉండే మొత్తం 325 మంది విద్యార్థులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఈ ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. మరో 150 మందికి సోమవారం పరీక్షలు నిర్వహించాం. వారి ఫలితాలు రావాల్సి ఉంది. బాధితులతో సన్నిహతంగా ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం."

-డాక్టర్ విశ్వేశ్వరయ్య, చమరాజ్​నగర్​ జిల్లా ఆరోగ్య అధికారి

మరోవైపు.. ధార్వాడ్​లోని ఎస్​డీఎమ్ వైద్య కళాశాలలో కొవిడ్​-19 బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరింది. వీరిలో మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్​ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. విద్యార్థులందరినీ క్వారంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

ఫ్రెషర్స్​ పార్టీతోనే..

ఎస్​డీఎమ్​ కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపించారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేశారు అధికారులు.

ఇవీ చూడండి:

Omicron virus India: దేశంలో ఒమిక్రాన్ కేసులు లేవు.. కానీ..!

ఒమిక్రాన్ భయాలు- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహిళ కోసం వేట

రాష్ట్రపతి పర్యటనలో భద్రతా సిబ్బందికి కరోనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.