ETV Bharat / bharat

వృద్ధాశ్రమంలో 58మందికి కరోనా.. ఇద్దరు మృతి - ముంబయి జైల్లో 38మంది ఖైదీలకు కొవిడ్​ పాజిటివ్​

మహారాష్ట్రలోని ఓ వృద్ధాశ్రమంలో 58మందికి కరోనా సోకింది. ఇద్దరు మృతి చెందారు. మరోవైపు.. బైకుల్లా జైలులో 38 మంది ఖైదీలూ కరోనా బారినపడ్డారు.

Param shantidham old age home, Byculla Jail
పరమ్ శాంతిధామ్​ వృద్ధాశ్రమం, బైకుల్లా జైలు
author img

By

Published : Apr 21, 2021, 3:46 PM IST

మహారాష్ట్ర పన్వేల్​​లోని పరమ్ శాంతిధామ్ వృద్ధాశ్రమంలో 58మందికి కరోనా సోకింది. వారిలో ఇద్దరు మృతి చెందారని పన్వేల్ కమిషనర్ తెలిపారు. బాధితుల్లో 16మందికి మెడికల్​ ఆక్సిజన్ అవసరం కావడం వల్ల ఆసుపత్రిలో చేర్పించామని పేర్కొన్నారు.

జైలులో 38 మంది ఖైదీలకు కరోనా​..

షీనా బోరా హత్యకేసు నిందితురాలు ఇంద్రానీ ముఖర్జీయాకు కరోనా సోకింది. ముంబయిలోని బైకుల్లా జైలులో ఉన్న ఆమెతో పాటు మరో 38మంది వైరస్ బారినపడినట్టు అధికారులు తెలిపారు.

ఆర్థికసమస్యల విషయమై షీనా బోరాని ఇంద్రానీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి 2012లో అత్యచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ హత్యకేసు 2015లో వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 58,924మందికి కరోనా సోకింది. 351మంది మృతి చెందారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్ ట్యాంక్​ లీకేజీ- 22 మంది మృతి

ఇదీ చదవండి: అంబులెన్స్​ కోసం రోజూ 9000 ఫోన్ కాల్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.