ETV Bharat / bharat

'పవర్'​ఫుల్ వృద్ధుడు- రష్యన్ IPL​లో సత్తా! 57 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ - 57 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్

57 Year Old Won Power Lifting Gold Medal : 57 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్​లో గోల్డ్ మెడల్ సంపాదించారు పంజాబ్​కు చెందిన ఓ వ్యక్తి. ఈ క్రమంలో నేషనల్ రికార్డును బద్దలు కొట్టారు. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు.

57 Year Old Won Power Lifting Gold Medal

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 9:12 AM IST

Updated : Nov 27, 2023, 10:05 AM IST

57 Year Old Won Power Lifting Gold Medal : పంజాబ్ లూధియానాకు చెందిన అవతార్ సింగ్ లాల్టన్ 57 ఏళ్ల వయసులో రికార్డులు తిరగరాస్తున్నారు. రష్యాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లీగ్(ఐపీఎల్) టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించారు. డెడ్​లిఫ్టింగ్​లో 240 కేజీలు ఎత్తి సంచలనం నమోదు చేశారు. ఈ విభాగంలో జాతీయ రికార్డు 200 కేజీలు కాగా.. దీన్ని బద్దలు కొట్టారు అవతార్. భారత్​కు తిరిగివచ్చిన ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు స్థానికులు.

Avtar Singh Lalton WON GOLD MEDAL IN RUSSIAN IPL
అవతార్ సింగ్​కు ఘనస్వాగతం

భారత్​లో 57 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చేస్తున్న ఏకైక అథ్లెట్ అవతార్ సింగ్. ప్రపంచ ఛాంపియన్​షిప్​లలో పాల్గొని వరుసగా రెండు గోల్డ్​ మెడల్స్ గెలిచిన ఘనతను సొంతం చేసుకున్నారాయన. సింగపూర్​లో జరిగిన పోటీల్లోనూ ఆయన మెడల్ గెలుచుకున్నారు. తాను పూర్తిగా భారతీయ డైట్​నే ఫాలో అవుతున్నట్లు అవతార్ సింగ్ చెబుతున్నారు. స్థానికంగా దొరికే ఆహార పదార్థాలతోనే పవర్ లిఫ్టింగ్​కు సన్నద్ధమైనట్లు చెప్పారు. 'టోర్నీలో భాగంగా విదేశీయులతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇండియన్ డైట్​తోనే వారిని ఓడించాను' అని చెబుతున్నారు.

అవతార్ సింగ్​కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ

'ఆ రికార్డు బద్దలు కొడతా'
వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న ప్రపంచ ఒలింపియన్ ఛాంపియన్​షిప్స్​కు సిద్ధమవుతున్నారు అవతార్ సింగ్ లాల్టన్. ఆ టోర్నీలో ప్రపంచ రికార్డు 275 కేజీలు. ఈ రికార్డును బద్దలుకొట్టాలన్న లక్ష్యంతో ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటున్నారు. 'శారీరకంగా నేను ఇప్పటికీ దృఢంగా ఉన్నా. నేను మరిన్ని మెడల్స్ తీసుకురాగలను. దేవుడి దయ ఉంటే 275 కిలోల ప్రపంచ రికార్డును సైతం బద్దలుకొడతా' అని ధీమాగా చెబుతున్నారు అవతార్.

అవతార్ సింగ్

ప్రయత్నం వెనుక సందేశం!
చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉన్న అవతార్ సింగ్.. ఈ వయసులోనూ పట్టుదలతో రాణించడం వెనుక ఓ కారణం ఉందని చెబుతున్నారు. పంజాబ్​లో తీవ్రంగా ఉండే డ్రగ్స్ సమస్యను దూరం చేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అంటున్నారు. క్రీడలవైపు యువత మొగ్గుచూపితే.. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టవచ్చని అవతార్ సందేశం ఇస్తున్నారు.

మాజీ సైనికుడి రన్నింగ్​కు పతకాలు దాసోహం
67 ఏళ్ల వయసులో 50 కిలోమీటర్ల రన్నింగ్ రేస్​లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు ఓ మాజీ సైనికుడు. హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన సురేంద్ర సింగ్.. మలేసియాలో జరిగిన ఓపెన్​ మాస్టర్ అథ్లెటిక్స్​ మీట్​లో మరో మూడు పతకాలు సాధించారు. ఇప్పటికే అనేక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కథేంటో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

63ఏళ్ల వయసులో రోజూ 50కిమీ సైక్లింగ్​- 100 రోజుల్లోనే 5వేల కిమీ పూర్తి, ఇండియా బుక్​లో స్థానం

12 ఏళ్ల వయసులో యాసిడ్​ దాడి- 37 ఆపరేషన్లు, ఆరేళ్లు ఆస్పత్రిలో నరకం- ఇప్పుడీ ప్రొఫెసర్​ 'స్వరకోకిల'

Last Updated : Nov 27, 2023, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.