మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాలో 55 అడుగుల శివలింగం రూపుదిద్దుకుంది. కలహండి జిల్లా గోలముండా ప్రాంతంలో భక్తులు నిర్మించిన ఈ మహాలింగం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఈ శివలింగ నిర్మాణానికి గ్రామస్థులు విరాళాలు సేకరించారు. కేవలం రెండున్నర నెలల్లోనే ఇది రూపుదిద్దుకోవడం విశేషం.
శివలింగ స్థాపనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఇదీ చదవండి: 'మత్తు' స్వీట్లు ఇచ్చి రూ.37 లక్షలు దోపిడీ!